రజినీకాంత్ భార్య లతకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ/చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కొచ్చాడయాన్ సినిమాకు సంబంధంచిన కర్నాటకలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేసేందుకు సుప్రీం నిరాకరించింది.
ఈ కేసులో విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. కొచ్చాడయాన్ చిత్ర నిర్మాణం కోసం ఆ చిత్ర నిర్మాణ సంస్థ మీడియా ఒన్ గ్లోబల్ డైరెక్టర్లలో ఒకరైన లతా రజనీకాంత్ హామీ మేరకు ఆ సంస్థకు బెంగళూర్‌కు చెందిన యాడ్‌బ్యూరో సంస్థ రూ.10 కోట్లు అప్పు ఇచ్చింది.

అయితే మీడియా ఒన్ గ్లోబల్ సంస్థ తీసుకున్న రుణంలో రూ.8.70 కోట్లనే యాడ్‌బ్యూరో సంస్థకు తిరిగి చెల్లించింది. ఇంకా మిగిలిన మొత్తాన్ని వడ్డీ సహా రూ.6.20 కోట్లు చెల్లించకపోవడంతో ఆ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications