వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రజనీకాంత్‌పై స్వామి అవమానకర వ్యాఖ్యలు, ఇంటి వద్ద భద్రత పెంపు

సూపర్ స్టార్ రజనీకాంత్ పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజనీకాంత్ పైన బీజేపీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజ్యాంగం గురించి అవగాహన లేదని, నటనలోనే కొనసాగితే మంచిదని హితవు పలికారు.

చదవండి: రజనీకి మా డోర్స్ తెరిచే ఉంటాయి: షా, రహస్యంగా పార్టీ సింబల్ డిజైన్

తమిళనాడులోని ప్రస్తుత రాజకీయాలకు రజనీకాంత్ ఏమాత్రం సరిపోరని స్వామి అన్నారు. ఆయన సినిమా రంగంలోనే ఉండి అభిమానులను, ప్రజలను అలరిస్తే చాలని అన్నారు.

రజనీపై తీవ్ర వ్యాఖ్యలు

రజనీపై తీవ్ర వ్యాఖ్యలు

రాజ‌కీయాల్లో చదువురాని వ్యక్తుల అవసరం ఉండదని, త‌మిళ‌నాడు రాజకీయాలకు ఆయన ఏ మాత్రం సరిపోరని స్వామి తీవ్ర అవమానకర వ్యాఖ్యలు చేశారు. ర‌జ‌నీకి అస‌లు రాజ్యాంగం, ప్రాథమిక హక్కుల వంటివి తెలియ‌వ‌న్నారు.

డైలాగ్‌లు బాగా చెబుతారు

డైలాగ్‌లు బాగా చెబుతారు

ర‌జ‌నీ బాగా డైలాగ్‌లు చెప్పగలుగుతారని చెప్పారు. ప్రజల‌కు మంచి వినోదం పంచుతారని అన్నారు. అస‌లు సినీ నటులు రాజకీయాల్లోకి రావడం ఏమిటని ప్ర‌శ్నించారు.

రజనీకి భద్రత పెంపు

రజనీకి భద్రత పెంపు

రజనీకాంత్‌ నివాసం వద్ద భారీగా భద్రత పెంచారు. తమిళ మున్నేట్ర పడాయ్‌ అనే సంఘాలు రజనీకాంత్‌ ఇంటి ముందు ఆందోళన చేయనున్నట్లు సమాచారం రావడంతో సోమవారం ఉదయం ఆయన నివాసం ముందు భద్రత కట్టుదిట్టం చేశారు.

రజనీ రాజకీయాల్లోకి రావడంపై స్పందిస్తూ.. యుద్ధమంటూ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తలైవా అభిమానులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ప్రధానితో భేటీ నేపథ్యంలోను..

ప్రధానితో భేటీ నేపథ్యంలోను..

ఈ నేపథ్యంలో రజనీ రాజకీయల్లోకి రాకూడదంటూ కొద్దిరోజులుగా తమిళ సంఘాలు ఆయన నివాసం ముందు దిష్టిబొమ్మలు తగలబెడుతూ ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు ఈ వారంలోనే ప్రధాని మోడీతో రజనీ భేటీ కానుండడంతో ముందు జాగ్రత్తగా ఇంటి ముందు భారీ భద్రతను పెంచారు.

English summary
Coming down heavily on Tamil superstar Rajinikanth’s supposed entry into the political arena, Bharatiya Janata Party leader Subramanian Swamy on Monday said the current situation of politics in Tamil Nadu does not demand ‘uneducated’ candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X