రజనీకాంత్ కాలాకు కర్ణాటకలో చిక్కులు, క్షమాపణ చెబితేనే అంటున్న కన్నడ సంఘాలు
బెంగళూరు: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాల చిత్రానికి కర్ణాటకలో చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆయన నటించిన కాలా చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే కర్ణాటకలో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
ఇటీవల కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి గురయ్యాయి. తన వ్యాఖ్యలపై రజనీ క్షమాపణ చెప్పాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విడుదలకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు.

కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్‌సీసీ) అధ్యక్షులు ఇటీవల మాట్లాడుతూ... కర్ణాటకలో కాలా సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ కన్నడ అనుకూల గ్రూప్స్ నుంచి లేఖలు వచ్చినట్టు చెప్పారు. కావేరీ జలాలపై రజనీ వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతీశాయన్నారు.
కాలా కర్ణాటక పంపిణీదారు ఒకరు మరోవైపు కేఎఫ్‌సీసీతో చర్చలు జరుపుతున్నారు. గురువారం నాటికి కాలా విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, కావేరీ జలాలపై రజనీకాంత్, కమల్ హాసన్ వ్యాఖ్యల నేపథ్యంలో వారి సినిమాల విడుదలకు తాము అంగీకరించబోమని ఇటీవల ప్రో కన్నడ యాక్టివిస్ట్‌లు చెబుతున్నారు. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన కాలా జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.












Click it and Unblock the Notifications