ఏప్రిల్ 2న, అభిమానులతో మీటింగ్, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ?

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయమై చర్చ మరోసారి హట్ టాపిక్ గా మారింది.అయితే ఏప్రిల్ రెండవ తేదిన రజనీకాంత్ అభిమానులతో సమావేశం కావడం రాజకీయపార్టీల్లో ఉత్కంఠకు కారణమైంది.

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పలు మార్లు ఊహగానాలు వచ్చాయి.అయితే ఈ ఊహగానాలను రజనీకాంత్ ఖండిస్తు వస్తున్నారు. అయితే రజనీకాంత్ సతీమణి మంగళవారం నాడు చేసిన ప్రకటన సంచలనానికి కారణమైంది.

rajinikanth

రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని, సరైన సమయంలో ఆయన నిర్ణయం తీసుకొంటారని రజనీకాంత్ సతీమణి మంగళవారం నాడు ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన వెంటనే రజనీకాంత్ అభిమానసంఘాలతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకోవడం కూడ రాజకీయపార్టీల్లో ఉత్కంఠకు తెరలేపుతోంది,

ఏప్రిల్ రెండవ తేదిన రజనీకాంత్ అభిమానులతో సమావేశం కావాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే అదే రోజున ఈ విషయమై ప్రకటన చేస్తారా, మరో రోజున ఈ విషయమై స్పష్టత వస్తోందా అనేది ఇంకా తేలలేదు.

అయితే రజనీకాంత్ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.అయితే ఆయన బీజేపీలో చేరుతారా, మరేదైనా పార్టీ వేదికను ఎంచుకొంటారా, రాజకీయాల్లోకి వస్తారా అనేది ఏప్రిల్ రెండవ తేదిన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

రజనీకాంత్ ను పలువురు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినా ఆయన ఈ విషయమై సున్నితంగానే తిరస్కరించారు.జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై మరోసారి చర్చసాగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
there is a rumour spreading in tamil nadu cine actor rajinikanth will enter into politics.he will be meeting with fans association on april 2 at chennai.
Please Wait while comments are loading...