సంచలనం:రజనీకాంత్ కొత్త పార్టీ పెడతారు: కాంగ్రెస్ నేత తిరునావుక్కరసు
సినీ నటుడు రజనీకాంత్ స్వంతంగా పార్టీని ఏర్పాటుచేయబోతున్నారని , ఆయన ఏ జాతీయ పార్టీలో గానీ, ప్రాంతీయపార్టీలో గాని చేరబోరని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు చెప్పారు.
చెన్నై: సినీ నటుడు రజనీకాంత్ స్వంతంగా పార్టీని ఏర్పాటుచేయబోతున్నారని , ఆయన ఏ జాతీయ పార్టీలో గానీ, ప్రాంతీయపార్టీలో గాని చేరబోరని తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు చెప్పారు.
రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్దమంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు చేసిన వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి.
రజనీకాంత్ బిజెపిలో చేరే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే చర్చ కూడ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

అయితే రజనీకాంత్ కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నారని, ఆయన ఏ పార్టీలో చేరబోరని తిరునావుక్కరసు చెప్పారు. ఒక స్నేహితుడిగా రజనీ తనకు గత 35 నుండి 40 ఏల్ళుగా తెలుసునన్నారు.
ఆయన ఏ జాతీయపార్టీలోగానీ, ప్రాంతీయపార్టీలో గానీ చేరతారని తాను అనుకోనని ఆయన చెప్పారు. ఆయనే స్వంతంగా పార్టీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదని తిరునావుక్కరసు అభిప్రాయపడ్డారు.
రజనీ పార్టీ పెడితే ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది ఆయన ఇష్టమన్నారు. దానిపై తానేమీ చెప్పలేనన్నారు. రాజకీయాలపై రజనీ తాజాగా పరోక్ష వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఆయన రాజకీయాల్లోకి రావొచ్చనంటూ బలంగా చర్చ జరుగుతుండగా ఆయనను తనవైపుకు తిప్పుకోవాలని బిజెపి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications