ఐటీ హబ్ చరిత్రలో రజనీకాంత్ నెంబర్ వన్, అన్ని రికార్డులు బ్రేక్, అవతార్ ఔట్ !
బెంగళూరు/చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం జైలర్. పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలు క్రియేట్ చేసిన జైలర్ చిత్రం గురువారం తెల్లవారుజామున నుంచే దేశంలోని అనేక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రదర్శించడం మొదలుపెట్టారు. గతంలో విడుదలైన సినిమాతో పరాజయాన్ని చవిచూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఈసారి జైలర్ అవతారంలో వచ్చి అభిమానులను ఆకట్టుకున్నారు.
చాలా రోజుల తర్వాత తలైవాను వెండితెరపై చూసేందుకు బెంగళూరులోని పలు థియేటర్ల దగ్గర వేకువ జామును నుంచే అభిమానులు సందడి చేశారు. చెన్నైతో పాటు తమిళనాడులో బుధవారం అర్దరాత్రి దాటిన తరువాత జైలర్ సినిమా షోలు మొదలైనాయి. ఇక ఐట హబ్ బెంగళూరులోని పలు మాల్స్ తో పాటు పలు థియేటర్లలో గురువారం వేకువ జామున నుంచి జైలర్ సినిమా షోలు ప్రదర్శించారు. సూర్యోదయానికి ముందే థియేటర్లలోకి వచ్చిన సినీ ప్రియులు, రజనీ అభిమానులు సందడి చేశారు.

ఫలితంగా జైలర్ చిత్రానికి రికార్డు స్థాయిలో ప్రదర్శనలు జరుగుతున్నాయి, ఈ విషయంలో జైలర్ సినిమా అనేక కొత్త రికార్డులను సృష్టించింది. తమిళనాడులోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా జైలర్ మంచి విజయాన్ని అందుకుంటున్నది, ముఖ్యంగా బెంగుళూరులో ఇప్పటివరకు ఏ సినిమా చేయని రికార్డును జైలర్ సినిమా సొంతం చేసుకుంది. జైలర్ సినిమా బెంగుళూరులో వినూత్న రికార్డును సొంతం చేసుకుంది. బెంగళూరు చరిత్రలోనే ఏ సినిమాకు కూడా ఇన్ని షోలు వెయ్యలేదు.
బెంగళూరు సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ సినిమా చేయని రికార్డును జైలర్ సినిమా సొంతం చేసుకుంది. బెంగళూరులో అత్యధిక ఓపెనింగ్ డే చిత్రాల జాబితాలో రాక్ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్- 2ను రికార్డును రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా బద్దలు కొట్టింది. బెంగళూరులో జైలర్ సినిమా మొదటి రోజు తమిళం, కన్నడ, తెలుగు వెర్షన్‌లతో సహా 1,092 షోలు ప్రదర్శిస్తున్నారు.

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ కూడా అయిపోయింది. ఇది బెంగళూరు నగరంలో అత్యధిక షోలు వేస్తున్న సినిమాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ రికార్డును సొంతం చేసుకుంది. బెంగుళూరులో విడుదలైన రోజున అత్యధిక ప్రదర్శనలు పొందిన టాప్ 3 చిత్రాలు ఇలా ఉన్నాయి. రజనీకాంత్ జైలర్ సినిమా 1,092 షోలు, కేజీఎఫ్ చాప్టర్- 2 సినిమా 1, 037 షోలు, అవతార్ ది వే ఆఫ్ వాటర్ 1, 014 షోలు ప్రదర్శించారు.
బెంగళూరులో జైలర్ కన్నడ వర్షన్ కంటే తెలుగు వర్షన్ లో ఎక్కువ షోలు వేస్తున్నారు. బెంగుళూరులో తమిళం, తెలుగుతో పాటు కన్నడ భాషల జైలర్ సినిమా విడుదల చేశారు. తమిళ వెర్షన్ మొదటి రోజు 1,021 షోలు వేస్తున్నారు. జైలర్ తెలుగు వెర్షన్‌కి 41 షోలు, జైలర్ కన్నడ వెర్షన్‌కు 30 షోలు మాత్రమే వేశారు. ఇక రెండు మూడు థియేటర్లు, మాల్స్ లో కొన్ని షోలు మాత్రమే జైలర్ హిందీ, మలయాళం వర్షన్ షోలు వేస్తున్నారు. మొత్తం మీద బెంగళూరు సినీ చరిత్రలో జైలర్ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేసి నెంబర్ వన్ గా నిలిచింది.












Click it and Unblock the Notifications