వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు సీఆర్పీఎఫ్ కు అధిపతిని నియమించిన కేంద్రం

మావోయిస్టుల భీకర విధ్వంసకాండ తరువాత ఎట్టకేలకు సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌ను కేంద్ర హోంశాఖ నియమించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీఆర్‌పీఎఫ్‌కు అధిపతిని నియమించింది. సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా రాజీవ్‌ రాయ్‌ భట్నాగర్‌ను కేంద్ర హోంశాఖ బుధవారం నియమించింది.

రాయ్‌ 1983 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. రెండురోజుల కిందట సుకుమాలో మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో 25మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో కేంద్రం తీరును కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై విమర్శించారు. సీఆర్‌పీఎఫ్‌కు ఇప్పటివరకు పూర్తికాలం అధిపతిని నియమించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

crpf new chief

సీఆర్‌పీఎఫ్‌ గత డైరెక్టర్‌ జనరల్‌ దుర్గా ప్రసాద్‌ ఫిబ్రవరి 28వ తేదీన పదవీ విరమణ చేశారు. అంతకు నెల రోజుల ముందే వారసుడిని నియమించాలి. కానీ కేంద్ర హోం శాఖ నిన్నటివరకు నిర్ణయం తీసుకోలేదు.

పెద్ద నోట్ల రద్దుతో మావోయిస్టుల వెన్నుముక విరిగిపోయిందని, మరో దిక్కులేక దాదాపు 700 మంది మావోయిస్టులు లొంగిపోయారని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ప్రకటించింది. ఇది తప్పుడు ప్రకటనని తర్వాత తేలింది.

సుకుమా దాడి నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌కు వెంటనే అధిపతిని నియమించినట్టు తెలుస్తోంది. అలాగే ఇండో-టిబేటన్‌ బార్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)కి కూడా 1983 బ్యాచ్‌కు చెందిన ఆర్కే ప్రచండ నియమితులయ్యారు.

English summary
New Delhi: IPS officer of the 1983 batch, Rajiv Rai Bhatnagar has been appointed the new DG of the CRPF just days after the Sukma attacks. The Naxalite attack in Chhatisgarh’s Sukma had resulted in the death of 25 CRPF personnel. An injured jawan had told ANI that that attack had been carried out by around 300 Naxalites. CRPF jawan Sher Mohammed, who had been injured in the attack had informed reporters that the Naxals had first sent villagers to trace the jawans’ locations and then started the attack. The CRPF jawans are also reported to have fired back and killed many Naxalites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X