భార్య విడాకులు ఇచ్చిందని మిఠాయిలు పంచి సంబరం చేసుకొన్న భర్త, ఎందుకంటే?
తన భార్య నుండి విడాకులు రావడంతో ఓ భర్త పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొన్నాడు. మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని వ్యకం చేశాడు.
అహ్మదాబాద్:తన భార్య నుండి విడాకులు రావడంతో ఓ భర్త పెద్ద ఎత్తున సంబరాలు చేసుకొన్నాడు. మిఠాయిలు పంపిణీ చేసి తన సంతోషాన్ని వ్యకం చేశాడు.
గుజరాత్ లోని రాజ్ కోట్ కు చెందిన రింకేష్ రచ్చ్ అనే వ్యక్తికి తన భార్య నుండి విడాకులు వచ్చాయి. దీంతో ఆయన మిఠాయిలు పంచి సంబరాలు చేసుకొన్నాడు.
26 ఏళ్ళ రింకేష్ జిన్నింగ్ మిల్లును నిర్వహిస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఆయనకు వివాహమైంది.అయితే పెళ్ళైన ఏడాది నుండే వేరుకాపురం పెట్టాలని భార్య ఒత్తిడి చేసింది. భర్తను వేధింపులకు గురిచేసింది.

దీంతో మానసిక క్షోభను అనుభవించానని రింకేష్ చెప్పాడు. దీంతో విడాకులకు సిద్దమైనట్టు చెప్పారాయన.అయితే చట్టాలు ఎక్కువగా మహిళలకు అనుకూలంగా ఉండడంతో న్యాయం కోసం రెండేళ్ళు పోరాటం చేసినట్టు ఆయన చెప్పారు.
ఇన్ని కష్టాలు అనుభవించిన తనకు విడాకులు మంజూరుకావడంతో రింకేష్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. విడాకులు రావడంతో సుమారు 50 కేజీల బర్పీ మిఠాయి బాక్సులను సన్నిహితులకు, బంధువులకు పంచారు.
విడాకులు వచ్చిన విషయం తెలియగానే ఆయన సంతోషంతో ఎంజాయ్ చేశాడు.విడాకుల మంజూరైనందుకు మిఠాయిలు పంచిన విషయం సోషల్ మీడియాలో ఫోటోలు రావడంతో ఆయనను ఫోన్ చేసీ అభినందిస్తున్నట్టు చెప్పారు. మళ్ళీ పెళ్ళి చేసుకొంటానని ఆయన చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications