మోనికా హత్య కేసు: పోర్న్ వీడియోలు చూపించి కసితీరా రేప్ చేశాడు

పనాజీ: గోవాకు చెందిన ప్రముఖ పెర్ఫ్యూమ్ డిజైనర్ మోనికా ఘర్దే హత్య కేసులో నిందితుడు విచారణలో నిర్ఘాంతపోయే విషయాలను వెల్లడించాడు. నిందితుడు రాజ్ కుమార్ సింగ్ ఆమెకు స్మార్ట్ ఫోన్‌లో మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించి, ఆపై అత్యాచారం చేసి హతమార్చినట్లు గోవా పోలీసులు వెల్లడించారు.

ఇంతకు ముందు భావించినట్లుగా ఇది అనుకోకుండా చేసిన హత్య కాదని, ముందుగానే పథకం ప్రకారం హతమార్చాడని గోవా డీఐజీ విమల్ గుప్తా తెలిపారు. మోనికా ఘర్దే హత్య రోజు జరిగిన పరిణామాలను ఆయన మీడియాకు వెల్లడించారు.

Rajkumar showed perfumer Monika Ghurde porn clips before raping her

సెక్యూరిటీ సూపర్‌వైజర్‌గా నటించి అక్కడకు వచ్చిన రాజ్‌కుమార్ సింగ్ ఆమె ఇంటి తలుపు తట్టాడు. మోనిక తలుపు తీయగానే బలవంతంగా లోనికి వచ్చి ఆమెను కత్తితో బెదిరించాడు. అనంతరం ఆమెపై మత్తు మందు చల్లి అరిచేలోపే ఆమె నోరు నొక్కేసి, బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లాడు.

మోనిక దారుణ హత్య: ఏటీఎం వాడి దొరికిన హంతకుడు

దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ఆమెను మంచం మీద పడుకోబెట్టి రెండు చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. ఆమె పర్సులో నాలుగు వేలు ఉండటంతో అవి తీసుకొమ్మని ఆమె చెప్పింది.

అది చాలదని, మరింత ఇవ్వాలని డిమాండ్ చేయడంతో తన ఏటీఎం కార్డు తీసుకొమ్మని చెప్పడంతో పాటు పిన్ నెంబరు కూడా చెప్పింది. తర్వాత ఆమె సెల్‌ఫోన్ లాక్కుని, దాని పాస్‌వర్డ్ అడిగాడు. ఫోన్ తెరిచిన తర్వాత ఆమెకు బలవంతంగా మూడు పోర్న్ వీడియో క్లిప్స్ చూపించాడు.

ఆ తర్వాత ఆమెపై బలవంతంగా అత్యాచారం చేశాడని డీఐజీ వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న భయంతో ఆమె పీక పిసికి, దిండుతో ఆమె ముఖం మీద నొక్కి ఊపిరాడకుండా చేసి చంపేసినట్లు గుప్తా తెలిపారు.

విచారణలో భాగంగా జూన్ 7వ తేదీన తొలిసారి ఇదే అపార్టుమెంటులో ఏవైనా ఖాళీ ఫ్లాట్లు ఉన్నాయా? అని అడిగేందుకు మోనికా ఘర్డే అక్కడకు వచ్చారు. ఈ క్రమంలో ఆమెకు ఫ్లాట్ వివరాలు చెప్పేటప్పుడే ఆమె పట్ల రాజ్‌కుమార్ సింగ్ ఆకర్షితుడయ్యాడని చెప్పారు.

అప్పటినుంచి ఆమెను జాగ్రత్తగా గమనిస్తూ ఒక్కరే ప్లాట్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నాడని డీఐజీ వెల్లడించారు. తన కారు కడిగేందుకు మోనిక అతడిని నియమించినప్పటి నుంచి ఆమెతో మాటలు పెంచి మరింత చనువుగా ఉంటున్నాడు.

దీంతో ఆమె ఫ్లాట్‌లో అణువణువూ అతడికి తెలుసన్నారు. జూలై 22న అతడిపై మోనిక సహా పలువురి నుంచి ఫిర్యాదులు రావడంతో అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతోపాటు రెండు నెలల జీతం కూడా ఇవ్వకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టాడని వివరించారు.

మోనికా ఘర్దే హత్యకు కారణం ఆమె పట్ల వ్యామోహం, కక్షేనని పోలీసులు తేల్చేశారు. కాగా, రాజ్ కుమార్ సింగ్ హర్యానాకు చెందినవాడు. హర్యానాలోని ఓపెన్ స్కూల్ ద్వారా బీకాం పూర్తి చేశాడు. సెక్యూరిటీ గ్రూప్‌‌లో చేరేందుకు గాను ఈ ఏడాది ఏప్రిల్ 5న గోవాకు వచ్చాడు.

తొలుత ఓ సెక్యూరిటీలో కంపెనీలో చేరిన రాజ్ కుమార్ అనంతరం దానికి రాజీనామా చేసి వేరొక సెక్యూరిటీ కంపెనీలో చేరాడు. దీంతో అతడు మోనికా ఘర్దే నివాసం ఉంటున్న సపనా రాజ్ వ్యాలీలో సెక్యూరిటీగా చేరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+