ఇదీ మేం: తనపై కామెంట్ చేసిన హీరోకు స్మృతి ఇరానీ దిమ్మతిరిగే కౌంటర్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై సెటైర్ వేశారు. దీనిపై స్మృతి కూడా ధీటుగా స్పందించారు. ఆయన పరోక్షంగా కామెంట్ చేయడంతో.. ఆమె సీరియస్ అవ్వకుండా సమాధానం చెప్పారు.
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై సెటైర్ వేశారు. దీనిపై స్మృతి కూడా ధీటుగా స్పందించారు. ఆయన పరోక్షంగా కామెంట్ చేయడంతో.. ఆమె సీరియస్ అవ్వకుండా సమాధానం చెప్పారు.
గోవాలో సోమవారం 48వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్‌కుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి స్మృతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

కేంద్రమంత్రి స్మృతి లాగే ఇరానీ అంటూ
కార్యక్రమంలో భాగంగా ప్రముఖ ఇరానియన్ దర్శకుడు మజిద్ మజీది తెరకెక్కించిన బియాండ్ ది క్లౌడ్స్ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా గురించి వ్యాఖ్యాతగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. మజిద్ మన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లాగే ఆయన కూడా ఇరానీనే అని చమత్కరించాడు.

కేంద్రమంత్రిపై విమర్శ, ఇదీ ప్రభుత్వం సహనం
దీనిపై స్మృతి ఇరానీ స్పందించారు. ఓ మంత్రిపై హీరో రాజ్‌కుమార్ రావ్ కామెంట్ చేశాడని, దానిని బట్టే ప్రభుత్వం ఎంత సహనంతో ఉందో అర్థమవుతోందని కౌంటర్ ఇచ్చారు.

నీ కాలు విరగ్గొట్టింది బీజేపీ వారు అనకుండా ఉంటారు
నటుడు రాజ్‌కుమార్ రావుకు ధన్యవాదాలు అని, మీ వ్యాఖ్యలతోనైనా నీ కాలు విరగ్గొట్టింది బీజేపీ కార్యకర్తలేనని ఎవ్వరూ మాపై నిందలు వేయకుండా ఉంటారని ఘాటుగా జవాబిచ్చారు.

రాజ్ కుమార్ కాలికి గాయం
సినిమా చిత్రీకరణ సమయంలో రాజ్‌కుమార్ కాలికి గాయమైంది. దీంతో ఆయన చేతి కర్రలతో కార్యక్రమానికి వచ్చారు. స్మృతి ఇరానీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. రాజ్‌కుమార్‌కి పరోక్షంగా చురకలంటించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications