Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్‌నాథ్ కెప్టెన్, మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్ అమిత్ షా: మోడీ

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి రాజ్‌నాథ్ సింగ్ కెప్టెన్ అయితే, ఆ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు అమిత్ షాకు లభించిందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శనివారం జరిగిన బిజెపి జాతీయ మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అమిత్ షాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

అదే విధంగా దేశ వ్యాప్తంగా ఉన్న లక్షలాది కార్యకర్తలు పార్టీ విజయం కోసం అవిరాళ కృషి చేశారని ప్రశంసించారు. అమిత్ షా గురించి తనకు బాగా తెలుసునని, ఆయన నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ప్రభుత్వ నిర్వహణలో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.

Rajnath 'captain', Amit Shah 'man of the match' of Lok Sabha polls: Narendra Modi

తమ పార్టీ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని కొందరు రాజకీయ పండుతులు చెప్పారనీ.. అయితే ప్రజలు మాత్రం తమకే పట్టం కట్టారని తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఈ సందర్భంగా మోడీ చెప్పారు. ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిణామాలను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని అన్నారు.

గతంలో తానెవరో ఢిల్లీ ప్రజలకు తెలియదని కానీ, 60 రోజుల్లోనే తానేంటో అందరికీ తెలిసిందని చెప్పారు.
వ్యవస్థను ప్రక్షాళణ చేసేందుకు ఓ పద్ధతిని నిర్దేశించుకోవడానికి ఈ 60 రోజులు సరిపోయాయని మోడీ తెలిపారు.
60ఏళ్ల పాటు ఏమీ చేయని కాంగ్రెస్ ఈ 60 రోజుల్లో ఏం చేశారని తమని ప్రశ్నించడం విడ్దూరంగా ఉందని మోడీ కాంగ్రెస్ నేతలకు చురకంటించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+