వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్నోలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకంలో భాగంగా కేంద్ర హోం మంత్రి, లక్నో ఎంపీ రాజ్‌నాధ్ సింగ్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. లక్నో జిల్లాలోని "బేటీ" అనే గ్రామాన్ని రాజ్‌నాధ్ సింగ్ దత్తత తీసుకున్నట్లు బీజేపీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వీరేంద్ర తివారీ మంగళవారం తెలిపారు.

ఈ గ్రామం లక్నో పార్లమెంట్ నియోజక వర్గంలో కాకుండా.... మోహన్ లాల్ గంజ్ పార్లమెంట్ నియోజక వర్గంలో ఉండటం విశేషం. "బేటీ" అనే గ్రామం సరోజిని నగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఉంది.

Rajnath Singh adopts Beti village in Lucknow

ఇటీవల తన రెండు రోజుల వారణాసి పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామం కింద తన నియోజక వర్గంలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రధాని మోడీ ఈ గ్రామాన్ని 2016 కల్లా మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేయనున్నారు. వారణాసికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయపుర గ్రామాన్ని మోడీ దత్తత తీసుకున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్‌ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్‌సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద పుత్తమరాజు కండ్రిగ గ్రామాన్ని దత్తతు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు.

పుత్తరాజుకండ్రిక గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్‌ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.

English summary
Union Home Minister and Lucknow MP Rajnath Singh has adopted Beti village in the district under the Pradhan Mantri Adarsh Gram Yojna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X