పాక్ సైనిక మూలాలు ధ్వంసం, బ్రహ్మోస్ తో వణికింది- ఇక నెక్స్ట్ .. రాజ్ నాధ్..!!
ఆపరేషన్ సింధూర్ పై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ కీలక ప్రకటన చేసారు. పాక్ కు బుద్ధి చెప్పేలా సరిహద్దులకే తమ దాడులు పరిమితం కాలేదని చెప్పారు. పాక్ సైనిక స్థావరాలు ఉన్న రావల్పిండి పైనా దాడి చేసామని వెల్లడించారు. బ్రహ్మోసి క్షిపణితో వారికి శక్తి ఏంటో చెప్పామని వివరించారు. శత్రువు ను బ్రహ్మోస్ దారికి తెచ్చిందన్నారు. తాము ఎక్కడా సామాన్యుల పైన దాడులు చేయలేదని.. ఉగ్రవాదులను మట్టు బెట్టామని వెల్లడించారు. దేశ భద్రత విషయంలో ఎంత కఠిన నిర్ణయాలకు అయినా వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు.
రావల్పిండి పై దాడి
ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులకు గట్టి జవాబు ఇచ్చామని రాజ్ నాధ్ చెప్పుకొచ్చారు. భారత్ - పాక్ ఉద్రిక్తతల వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సమయంలో కీలక వ్యాఖ్యలు చే సారు. పాకిస్తాన్ వైమానిక దళం కీలక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని బ్రహ్మోస్-ఏ (ఎయిర్-లాంచ్డ్) క్రూయిజ్ క్షిపణులను భారత్ ప్రయోగించింది. బ్రహ్మోస్ మిసైల్‌తో పాక్ ఎనిమిది సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. తాజాగా రాజ్ నాధ్ సైతం రావల్పిండి పైనా దాడి చేసిన విషయాన్ని వెల్లడించారు. మన దేశం లోని ఆలయాలు... గురు ద్వారాల పైన పాక్ దాడులకు ప్రయత్నించిందని వివరించారు.

బ్రహ్మోస్ ప్రయోగంతో
ఈ దాడుల్లో బ్రహ్మోస్ క్షిపణి వినియోగించారు. ఇక, ఇప్పుడు లక్నోలో ప్రారంభించిన ఈ బ్రహ్మోస్ యూని ట్ నుంచి ఏడాదికి 80 నుండి 100 క్షిపణులు ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగినలా డిజైన్ చేశారు. రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ కేంద్రం బ్రహ్మోస్ క్షిపణుల లో కీలక పాత్ర పోషించనుంది. 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. బ్రహ్మోస్ క్షిపణి 290 నుండి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఈ న్యూ జెనరేషన్ బ్రహ్మోస్ క్షిపణుల పరిధి 300 కిలోమీటర్లు కాగా, వాటి బరువు గణనీయంగా తగ్గించారు. ప్రస్తుతం ఉన్న బ్రహ్మోస్ బరువు 2900 కిలోలు అయితే, కొత్త తరం క్షిపణుల బరువు కేవలం 1290 కిలోలకే పరిమితమైంది.
కాగా, భారత్ శక్తి ఏంటో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని రాజ్ నాధ్ వ్యాఖ్యానించారు. పాక్ దాడులకు ప్రయత్నించగా మన సైన్యం వాటిని ధీటుగా తిప్పి కొట్టిందని వివరించారు. ఇది నయా భారత్ అని ప్రపంచానికి చాటి చెప్పామని రాజ్ నాధ్ పేర్కొన్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications