అక్బర్ ది గ్రేట్ అయితే, మహారాణా ప్రతాప్ కూడా: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన అక్బర్ చక్రవర్తి గొప్పవాడు అనడంలో సందేహం లేదని, ఆయనను గొప్పగా కీర్తించిన చరిత్రను కూడా తప్పుబట్టమని, అయితే రాజ్‌పుట్, మేవార్ రాజు మహారాణా ప్రతాప్ కూడా అంతేస్థాయి కలిగిన వ్యక్తి అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం అన్నారు.
దేశంలో పాఠ్యాంశాల్లో రాణా ప్రతాప్‌కు సరైన స్థానాన్ని కల్పించలేకపోయారని చెప్పారు. హల్ధీఘాట్ యుద్ధంలో అక్బర్ చేతిలో రాణా ప్రతాప్ ఓడిపోయిన సంగతిని తాను కూడా అంగీకరిస్తానని చెప్పారు. రానున్న రోజుల్లో చరిత్రను సరైన రీతిలో సవరించాల్సి ఉందన్నారు.
అక్బర్ ది గ్రేట్ అయితే, రాణా ప్రతాప్ కూడా ది గ్రేట్ అన్నారు. స్వదేశం కోసం పోరాడిన ఎంతోమందికి రాణా ప్రతాప్ ఆదర్శంగా నిలిచారన్నారు. కన్నభూమి కోసం అతను చేసిన త్యాగాలు కొనియాదగినవన్నారు. రాణా ప్రతాప్‌ను ఆదర్శంగా తీసుకొనే వియత్నామీలు అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ఓడించాలన్నారు.

ప్రతాప్ ఘడ్ జిల్లా కలెక్టరేట్‌లో రాజ్‌నాథ్ సింగ్ రాణాప్రతాప్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాను వ్యక్తిగతంగా మహారాణా ప్రతాప్ గ్రేట్ అని భావిస్తానని చెప్పారు. మహారాణా ప్రతాప్‌ను రానున్న జనరేషన్‌కు గ్రేట్ వ్యక్తిగా పరిచయం చేయాల్సి ఉందన్నారు.
మొఘలుల పైన పోరాడిన మహారాణా ప్రతాప్... చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి వారితో పాటు ఛత్రపతి శివాజీ, బందా బైరాగీలకు కూడా ఆదర్శనీయుడన్నారు. మహారాణా ప్రతాప్ ఓ కులానికి చెందిన రాజు కాదని, ఆయన అందరికీ ఆదర్శమన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications