మోడీ ప్రమాణానికి రజనీ రాకున్నా.. భార్య లత హాజరు!
న్యూఢిల్లీ/చెన్నై: నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సూపర్ స్టార్ రజనీకాంత్ గైర్హాజరవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆయన సతీమణి లత మాత్రం హాజరు కానున్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ సూపర్ స్టార్‌ను ఆహ్వానించారు.
అయితే శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షను ఆహ్వానించడంపై తమిళ పార్టీలు, తమిళులు మండిపడుతున్నారు. తమిళనాడులో, ఢిల్లీలో రాజపక్ష రావడాన్ని నిరసిస్తూ ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. రాజపక్ష దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. జయలలిత, కరుణానిధి, వైగోలు రాజపక్ష రాకను వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ కూడా మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దూరం జరిగారు. అయితే, ఆయనకు బదులు ఆయన సతీమణి లత మాత్రం హాజరు కానున్నారని సమాచారం. రజనీకాంత్ అందుబాటులో లేరని, అందువల్లే ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని చెబుతున్నారని సమాచారం. కానీ రాజపక్ష రాకపై తమిళుల నిరసన కారణంగానే ఆయన రావడం లేదని భావిస్తున్నారు.
మోడీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధిపతులు తరలి వస్తున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా హాజరు కానున్నారట. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఢిల్లీకి వచ్చారు.












Click it and Unblock the Notifications