రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ భయాలు ? మొదలైన రిసార్ట్ రాజకీయం..!
ఈ నెల 18న జరిగే రాజ్యసభ ఎన్నికలు (Rajya sabha Election) చాలా లెక్కల్ని మార్చబోతున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో ఎన్డీయే ఈ ఎన్నికలతో మూడింట రెండొంతుల మెజార్టీ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా సీట్ల సంఖ్యను స్వల్పంగా పెంచుకునే అవకాశాలున్నాయి. ప్రాంతీయ పార్టీలు మాత్రం దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలను క్రాస్ ఓటింగ్ భయాలు వెంటాడుతున్నాయి.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ (Congress) పార్టీకి ఒక్క రాజ్యసభ సీటు మాత్రమే గెల్చుకునే బలం ఉంది. దీంతో ఈసారి చాలా వ్యూహాత్మకంగా తమిళనాడుకు చెందిన మీనాక్షి నటరాజన్ ను మధ్యప్రదేశ్ నుంచి బరిలో దింపింది. అయితే ఆమెను ఎలాగైనా ఓడించేందుకు మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీజేపీ (BJP) వల విసురుతోంది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ.. తమ ఎమ్మెల్యేలను కర్నాటక రాజధాని బెంగళూరుకు తరలించింది.

పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేలను బెంగళూరులోనే ఉంచాలని పార్టీ నాయకత్వం నిర్ణయించడంతో, వారు మధ్యప్రదేశ్ నుండి తరలివెళ్లడం ప్రారంభించారు.భోపాల్లో ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘార్ నివాసంలో నిన్న రాత్రి జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ీంంతో ఇవాళ్టి నుంచి పార్టీ ఎమ్మెల్యేలందరినీ కర్ణాటకలోని బెంగళూరుకు తరలిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ రేవనాథ్ చౌరే తెలిపారు. బీజేపీ సభ్యులు "నోట్ల సంచులతో" తమను సంప్రదించారని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు చెప్పారని, అయితే తాము అలాంటి ఆఫర్లను తిరస్కరించామని వారు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications