బిగ్ బాస్‌లో వల్గారిటీ, అసభ్యత: 'పెద్దల సభ' ఆగ్రహం
న్యూఢిల్లీ: బిగ్ బాస్ వంటి పలు రియాలిటీ టీవీ షోల కంటెంట్ విషయంలో రాజ్యసభలో మంగళవారం విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సభ్యులు మాట్లాడుతూ... అటువంటి కార్యక్రమాలు అసభ్యంగా, అమర్యాదకరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కొన్నిసార్లు అమ్మాయిలు కురచ దుస్తులతో నృత్యం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రసారమవుతున్నాయన్నారు. వెంటనే ఇందుకు సభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందించారు. అలాంటి కార్యక్రమాలు ఛానళ్లలో వస్తున్నప్పుడు ఫిర్యాదు చేసేందుకు ఓ టెలిఫోన్ నంబర్ డిస్ ప్లే అవుతుందన్నారు.

కార్యక్రమాలలో ఏదైనా ఉల్లంఘన ఉంటే తప్పకుండా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం చూసేవారి ఫిర్యాదు ఆధారంగానే కాకుండా తాము పరిశీలన అనంతరం చర్యలు తీసుకుంటామని రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్ చెప్పారు.
ఫిర్యాదులను పరిశీలించేందుకు శాఖకు సొంతంగా ఓ సెల్ ఉందని చెప్పారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
గత ఏడాది 40వేల ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అందులో 1500 కేసులు నమోదయ్యాయని చెప్పారు. చానళ్ల కార్యక్రమాల పైన పర్యవేక్షణలో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ 1500 టీవీ చానల్స్‌ను ఏకకాలంలో మానిటర్ చేస్తోందన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications