బాలనేరస్థుల వయోపరిమితి 16: రాజ్యసభలో ఆమోదం
న్యూఢిల్లీ: రాజ్యసభలో జువైనల్ చట్ట సవరణ బిల్లు పైన మంగళవారం సాయంత్రం ఓటింగ్ జరిగింది. చట్టంలో సవరణలను సిపిఎం, ఎన్సీపీలు వ్యతిరేకించాయి. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపనందున సిపిఎం వాకౌట్ చేసింది. ఓటింగ్ సమయంలో విజిటర్స్ గ్యాలరీలో నిర్భయ తల్లిదండ్రులు ఉన్నారు.
చట్ట సవరణ పైన చర్చ, ఓటింగ్‌ను నిర్భయ తల్లిదండ్రులు ఆసక్తిగా గమనించారు. జువైనల్ చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఇక నుంచి బాల నేరస్తుల వయోపరిమితి 18 నుంచి 16కు తగ్గనుంది. తీర్పుల విషయంలో బాల నేరస్తుల ప్రామాణిక వయస్సు 16గా ఉండనుంది.













Click it and Unblock the Notifications