• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download
LIVE

దేశవ్యాప్తంగా 57 రాజ్యసభ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికలు ఆయా రాష్ట్రాల్లో జూన్ 10వ తేదీన జరుగుతున్నాయి. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో హరియాణా రాష్ట్రంలో రిసార్ట్ పాలిటిక్స్‌ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే అక్కడి అధికారిక బీజేపీ పార్టీ తమ ఎమ్మెల్యేలందరిని చండీగఢ్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది. ఇక కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను ఓటింగ్‌కు కొన్ని గంటల ముందు అసెంబ్లీ ఆవరణకు తీసుకురానున్నట్లు సమాచారం.

జూన్ 10వ తేదీన హర్యాణాలో రెండు సీట్ల కోసం ఎన్నిక జరగనుంది.ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక బీజేపీ-జేజేపీ అభ్యర్థి నెగ్గాలంటే ఆ కూటమికి 31 ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలంటే 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం కానుంది. ఇక దేశవ్యాప్తంగా మొత్తం 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మినిట్‌-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Election to 57 Rajyasabha seats to take place on June 10th.

Newest First Oldest First
3:09 PM, 10 Jun
రాజస్థాన్ రాజ్యసభ ఎన్నికలు
కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను డబ్బుతో ప్రలోభ పెట్టిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ బీజేపీ నేత డిప్యూటీ ప్రతిపక్షనేత రాజేంద్ర రాథోడ్
1:50 PM, 10 Jun
కర్నాటక రాజ్యసభ ఎన్నికలు
జేడీఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడంపై మండిపడ్డారు ఆ పార్టీ అధినేత కుమారస్వామి. కాంగ్రెస్ నిజరూపం బయటపడిందన్నారు.తమ ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని ముందే చెప్పినట్లు గుర్తు చేశారు.బీజేపీ బీ టీమ్‌గా కాంగ్రెస్ పనిచేస్తోందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు
12:14 PM, 10 Jun
కర్నాటక రాజ్యసభ ఎన్నికలు
జేడీఎస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ మంత్రులు ప్రలోభపెట్టి క్రాస్ ఓటింగ్ వేయాల్సిందిగా కోరినట్లు సమాచారం
12:13 PM, 10 Jun
కర్నాటక రాజ్యసభ ఎన్నికలు
జేడీఎస్ ఎమ్మెల్యే ఓటును అనర్హత ఓటుగా పరిగణించాలంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ.దేవెగౌడ కుమారుడు రేవన్న గౌడ తన బ్యాలట్ పేపర్‌ను కాంగ్రెస్ ఏజెంట్‌గా ఉన్న డీకే శివకుమార్‌కు చూపించాడంటూ ఫిర్యాదు చేసిన బీజేపీ
11:47 AM, 10 Jun
హర్యానా
హరియాణాలో రాజ్యసభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
11:12 AM, 10 Jun
హర్యానా
కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ నివాసానికి చేరుకున్న ఆ పార్టీ ఎమ్మెల్యేలు. ఇక్కడి నుంచి అజయ్ మాకెన్ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారు. ఆయన విజయం సాధిస్తారని ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ వ్యాఖ్యానించారు.
11:04 AM, 10 Jun
కర్నాటక
కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య కూడా బీజేపీకే మద్దతు ఇస్తారని ఆశిస్తున్నా. నిర్మల సీతారామన్ సహా తమ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులూ విజయం సాధిస్తారు: కర్ణాటక మంత్రి అశ్వర్థ నారాయణ
10:55 AM, 10 Jun
మహారాష్ట్ర
జోరుగా సాగుతున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్. తొలి గంటన్నరలోనే 50 శాతం పోలింగ్ ముగిసింది. 143 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో బీజేపీ-60, కాంగ్రెస్-20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
10:48 AM, 10 Jun
కర్నాటక
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. కాంగ్రెస్‌కు కార్యాలయానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?, రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకవడానికి కాంగ్రెస్ మద్దతు కోరారు. సిద్ధరామయ్య సహకారం తీసుకున్నారు. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణ.
10:42 AM, 10 Jun
కర్నాటక
తమ అభ్యర్థికి ఓటు వేయొద్దంటూ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తమ శాసన సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారంటూ ఆరోపించిన జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్‌డీ కుమారస్వామి
10:33 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి సభ్యులందరూ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసిన మహారాష్ట్ర మంత్రి అస్లాం ఖాన్. ఏఐఎంఐఎం, సమాజ్‌వాది పార్టీ తమకే మద్దతు ఇస్తున్నారని వెల్లడి.
10:29 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో అధికార మహావికాస్ అఘాడీ కూటమికి మద్దతు తెలిపిన అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ శాసన సభ్యులు.
10:26 AM, 10 Jun
కర్నాటక
రాజ్యసభ ఎన్నికల సందర్భంగా బెంగళూరు విధానసభలో తన ఓటు హక్కును వినియోగించుకుంటోన్న కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.
10:10 AM, 10 Jun
కర్నాటక
రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి బెంగళూరు విధానసభకు చేరుకున్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, జనతాదళ్ (సెక్యులర్)కు చెందిన ఇతర శాసన సభ్యులు.
9:50 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి శాసనసభకు చేరుకున్న కేంద్రమంత్రి పీయూష్ గోయెల్
9:40 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో అధికార మహావికాస్ అఘాడీకి చెందిన నలుగురు సభ్యులు విజయం సాధిస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసిన శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్.
9:38 AM, 10 Jun
రాజస్థాన్
రాజ్యసభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంటోన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్
8:55 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని మహారాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీ సభాపక్ష నేత ప్రవీణ్ దరేకర్ ధీమా వ్యక్తం చేశారు.
8:49 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో అధికార మహావికాస్ అఘాడీకి చెందిన నలుగురు సభ్యులు విజయం సాధిస్తారంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసిన మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థొర్రట్
8:43 AM, 10 Jun
మహారాష్ట్ర
రాజ్యసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి విధానసభకు చేరుకున్న మహారాష్ట్ర శాసన సభ్యులు. ఇంకాస్సేపట్లో పోలింగ్ ఆరంభం కానుంది.
8:25 AM, 10 Jun
ఢిల్లీ
మహారాష్ట్ర, రాజస్థాన్, హర్యానా, కర్ణాటక.. రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌ను ఎదుర్కొంటోన్నాయి. మిగిలిన 16 స్థానాల కోసం ఈ నాలుగు రాష్ట్రాల నుంచి పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
8:20 AM, 10 Jun
ఢిల్లీ
మొత్తం 57 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిల్లో ఏపీ, తెలంగాణ సహా ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
8:04 AM, 10 Jun
ఢిల్లీ
రాజ్యసభ ఎన్నికల పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాల కోసం ఇంకాస్సేపట్లో పోలింగ్ ఆరంభం కానుంది.
8:02 AM, 10 Jun
రాజస్థాన్
200 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఉన్న సభ్యుల సంఖ్య 108. మూడు రాజ్యసభ స్థానాలను గెలవాలంటే ఆ పార్టీకి 123 ఓట్లు అవసరం అవుతాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ఉంటుంది.
7:49 AM, 10 Jun
మహారాష్ట్ర
మహారాష్ట్రలోనూ రిసార్ట్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. బీజేపీ నాయకులకు అందకుండా ఉండటానికి శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించాయి.
7:41 AM, 10 Jun
బీజేపీ నాయకులు తమ రాష్ట్రపతి ఎన్నికల కోసం తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే క్యాంప్ పాలిటిక్స్ నిర్వహించాల్సి వచ్చిందని రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు రఘుశర్మ ఆరోపించారు.
7:31 AM, 10 Jun
ఢిల్లీ
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో- అటు హర్యానాలోనూ క్యాంప్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిన్నటివరకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో క్యాంప్‌లో ఉన్నారు. రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
7:27 AM, 10 Jun
రాజస్థాన్
అమెర్ ప్రాంతంలో ఈ ఉదయం 9 గంటల వరకు వాయిస్ కాల్స్, బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందుబాటులో ఉండవు. క్యాంప్ పాలిటిక్స్‌లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇక్కడి హోటల్ లీలాలో ఉంటోన్నారు.
7:13 AM, 10 Jun
రాజస్థాన్
రాజస్థాన్‌లో రాజ్యసభ ఎన్నికల వేడి పతాక స్థాయిలో కొనసాగుతోంది. రాజధాని జైపూర్ శివార్లలోని అమెర్ ప్రాంతంలో ఇంటర్‌నెట్‌ సౌకర్యాన్ని నిలిపివేసింది రాజస్థాన్ ప్రభుత్వం
1:40 PM, 9 Jun
రాజ్యసభ ఎన్నికల వేళ హరియాణాలో రిసార్ట్ పాలిటిక్స్ ప్రారంభం
READ MORE

English summary
Election to 57 Rajyasabha seats to take place on June 10th.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X