రాఖీ వేడుకలో ఊహించని విషాదం.. వందలాది మహిళలకు తీవ్ర అస్వస్థత!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో రాఖీ పండుగ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి చాలా మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు. బరేలీ బీజేపీ మేయర్ ఉమేష్ గౌతమ్ నేతృత్వంలో బరేలీ క్లబ్ గ్రౌండ్‌లో చీరలు, బహుమతుల పంపిణీ కోసం ఈ వేడుకను ఏర్పాటు చేశారు. అయితే అంచనాకు మించి దాదాపు 20 వేల మందికి పైగా మహిళలు తరలిరావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఈ భారీ ఈవెంట్ కోసం నిర్వాహకులు ముందుగానే కూపన్లు పంపిణీ చేయడంతో మహిళలు తమ పిల్లలు వృద్ధులతో సహా పెద్ద సంఖ్యలో మైదానానికి చేరుకున్నారు. కార్యక్రమం ప్రారంభమయ్యే సమయానికి తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో పాటు గుంపు గుంపులుగా జనం రావడం ప్రారంభించారు. చీరలు, బహుమతులు అందుకోవాలనే ఆరాటంలో మహిళలు బారికేడ్లను దాటుకుని వేదిక వైపు దూసుకెళ్లడంతో తోపులాట మొదలైంది.

ఉక్కత, రద్దీ, తోపులాట కారణంగా చాలా మంది మహిళలు మైదానంలోనే సొమ్మసిల్లి పడిపోయారు. మైదానమంతా మహిళల చెప్పులు, గాజులు, వ్యక్తిగత వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తీవ్ర గందరగోళం మధ్య పలువురు పిల్లలు తమ కుటుంబ సభ్యుల నుంచి విడిపోవడంలతో మైదానంలో ఆందోళన నెలకొంది. స్పృహతప్పి పడిపోయినవారిని, గాయపడిన మహిళలను వెంటనే అంబులెన్సులలో ఆస్పత్రులకు తరలించారు.
పరిస్థితి చేయ దాటిపోతుండటంతో మేయర్ ఉమేష్ గౌతమ్ మైదానంలో గుమిగూడిన జనాలను వేర్వేరు ద్వారాల వైపు పంపందుకు ప్రయత్నించారు. తన కుమారుడు పార్థ్ గౌతమ్ ను ప్రధాన గేటు వద్దకు పంపి అక్కడ కూడా రాఖీలు కట్టేలా ఏర్పాట్లు చేసినప్పటికీ రద్దీ తగ్గలేదు. ఈ కార్యక్రమం గురించి తమకు ముందస్తు సమాచారం లేదని.. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదని సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అనురాగ్ అర్య వెల్లడించారు.
ఇంత పెద్ద ఎత్తున మహిళలనుు ఆహ్వానించిన తరుణంలో దానికి తగ్గట్టుగా కనీస రక్షణ, గుంపుల నియంత్రణ ఏర్పాట్లు చేయకపోవడంపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తీవ్ర ఎండలో తాగేందుకు కనీసం మంచి నీటి సౌకర్యం కూడా కల్పించలేదని.. బహుమతుల పంపిణీ సమయంలో సరైన లైన్లు లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
बरेली
— Asian News UP/UK (@AsianNewsUP_UK) August 28, 2026
बारिश के बावजूद बरेली क्लब ग्राउंड में आयोजित रक्षाबंधन समारोह में हजारों बहनों का उमड़ा प्यार। बहनों ने मेयर डॉ. उमेश गौतम और उनके पुत्र पार्थ गौतम को रक्षा सूत्र बांधा।
शाम को सोशल मीडिया पर भगदड़ और हताहत होने की खबरें वायरल होने से शहर में हड़कंप, लेकिन अब तक प्रशासन… pic.twitter.com/nckvM6aqBW













Click it and Unblock the Notifications