కేజ్రీవాల్ ఐటం బాయ్: ఐటం గర్ల్ రాఖీ సావంత్
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ స్పందించారు. వివాదాలకు మారుపేరుగా మారిన రాఖీ సావంత్ - కేజ్రీవాల్‌ను ఐటమ్ బాయ్‌గా అభివర్ణించారు. ఐటమ్ గర్ల్ రాఖీ సావంత్ కేజ్రీవాల్ కన్నా బెట్టర్ అని శివసేన ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తన దృష్టిలో కేజ్రీవాల్ ఐటమ్ బాయ్ అని రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌తో తాను ఐటమ్ సాంగ్‌లో నటించాల్సి వస్తే ప్రజాదరణ పొందిన హిందీ పాట బాబుజీ జర ధీరేసే చలో, బిజ్లీ ఖడీ యహా బిజ్లీ ఖడీ అనే పాటపై నృత్యం చేస్తానని చెప్పారు.

కేజ్రీవాల్ కన్నా ఉత్తమంగా రాఖీ సావంత్ పాలన సాగిస్తారని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. తాను కేజ్రీవాల్ కన్నా బాగా పరిపాలన చేస్తానని ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించినందుకు ఆమె పొంగిపోయినట్లే ఉన్నారు. ఆ వ్యాఖ్య చేసినందుకు థాక్రేకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కూడా రాఖీ సావంత్ స్పందించారు. తేనీరు విక్రయిస్తూ నరేంద్ర మోడీ దేశాన్ని నడిపించినప్పుడు, ఐటమ్ గర్ల్‌గా ఉన్న తాను ఎందుకు నడిపించలేనని అన్నారు.












Click it and Unblock the Notifications