Ram Mandir Inauguration : ముస్లింకు అయోధ్య ఆహ్వన పత్రిక...
ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్య కోసం దేశంలోని హిందువులంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి మహత్తర కార్యాన్ని ప్రత్యక్షంగా చూడాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. అయితే, కేవలం అయోధ్య ఆహ్వాన పత్రికలు అందిన వారు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంటుంది. ఎందుకంటే, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వాన పత్రికలు అందిన వారు మాత్రమే హాజరుకావాలని ముందుగానే సూచించింది. అయితే, ఈ ఆహ్వాన పత్రికలు ఇప్పటికే చాలామంది ప్రముఖులకు, సినీతారలకు, హిందువులకు అందాయి. అయోధ్య ఆహ్వన పత్రిక తొలిసారిగా ఓ ముస్లిం వ్యక్తికి కూడా అందింది. కానీ, ఆయన మాత్రం ఈ మహత్తర కార్యానికి హాజరుకాలేనని, మరుసటి రోజు అయోధ్య శ్రీరాముని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఇంతకు ఆ ముస్లిం వ్యక్తి ఎవరో తెలుసుకుందాం..
మహ్మద్ హబీబ్ అనే వ్యక్తికి అయోధ్య ఆహ్వన పత్రిక అందింది. ఈయన ఉత్తరప్రదేశ్ మీర్జాపూర్‌కు చెందిన వ్యక్తి. ఈయన ఒక సాధారణ రైతు. ఈయకు అయోధ్య ఆహ్వానం అందడం ఏంటీ అని చాలామంది అనుకుంటుంటారు. మహ్మద్ హబీబ్ అనే వ్యక్తి బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అయోధ్యలో ఉన్న వారితో కలిసి కరసేవుకుడిగా కొట్లాడాడు. 1992 డిసెంబర్ 2వ తేది నుంచి ఐదురోజుల పాటు ఆ కొట్లాటలో పాల్గొన్నారు. ఆ సమయంలో హబీబ్ చేసిన పోరాటాన్ని అయోధ్య రామమందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ గుర్తించింది. అందుకుగాను ఇప్పడు తనకి అయోధ్య రామమందిర ప్రారంభాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించింది.

అయోధ్య రాముని ప్రాణప్రతిష్టకు హాజరుకాలేనని చెప్పిన మహ్మాద్ : అయితే, హబీబ్‌కు ఆహ్వనం అందినా, తను ఆ సమయంలో ఇంట్లోనే ఉండి టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూస్తానని జనవరి 22న అయోధ్యకు హాజరుకావడం లేదని పేర్కొన్నారు. ఈయన మీర్జాపూర్ బిజెపి జిల్లా యూనిట్‌లో అప్పట్లో వివిధ పదవుల్లో పనిచేశారని తెలిపారు. బిజెపీలో తను ఎన్నో ఏళ్లుగా కార్యకర్తగా పనిచేసానని, ఈ సందర్భంగా తనకు అయోధ్యలో ఉన్నరోజులో మరోసారి గుర్తుకు వచ్చాయని తెలిపారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ నెల 22న జరిగే ఈ మహత్తర కార్యానికి రావడం లేదని, మరుసటి రోజు అయోధ్య రామాలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నాడు. అయోధ్య రామమందిర ప్రారంభాన్ని టీవీలో ప్రత్యక్షంగా వీక్షిస్తానని తెలిపారు.












Click it and Unblock the Notifications