డేరాబాబా పేరిట 19 గిన్నిస్‌బుక్ రికార్డులు
డేరా బాబాపై 19 గిన్నిస్ రికార్డులున్నాయి.రక్తదానం, మొక్కల పెంపకంపై రికార్డులుఅత్యాచార కేసులో సిబిఐ కోర్టు డేరా బాబాను దోషిగా తేల్చింది
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ఆధ్యాత్మిక గురువు గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పేరు 19 గిన్నిస్‌బుక్ రికార్డులున్నాయి.
2003 నుండి 2015 మధ్య కాలంలో ఈ 19 గిన్నిస్‌బుక్ రికార్డులు నమోదయ్యాయి. 2003, డిసెంబర్ 3న గుర్మీత్ మొదటి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు.15,432 మంది రక్తదాతలతో క్యాంప్ ఏర్పాటు చేసి రక్తదానం చేయడంతో ఆయన ఈ రికార్డును నమోదు చేశారు.

2004లో మళ్లీ రక్తదానంలో 17,921 దాతలతో పాత రికార్డును బ్రేక్ చేశారు. తర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్యక్రమంతో ద్వారా రెండు రికార్డులను నమోదు చేశారు.
2010లో రక్తదానంలో 43,732 దాతలతో మరో రికార్డును సృష్టించాడు. దీనితో పాటుగా 4,603 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించే క్యాంపును ఏర్పాటుచేసి రికార్డు క్రియేట్ చేశారు రామ్‌రహీమ్‌సింగ్.
వీటితో పాటు మొక్కలు నాటడం, నాణేలు గాల్లోకి ఎగురవేయడం, డాప్లర్ అల్ట్రాసౌండ్ పరీక్షల క్యాంప్ నిర్వహణ, బీపీ నమోదు క్యాంపు నిర్వహణ, షుగర్ వ్యాధి చెకప్ క్యాంపు నిర్వహణతో డేరా బాబా గిన్నిస్ బుక్‌లో స్థానం పొందారు.
కొలెస్ట్రాల్ పరీక్షల క్యాంపు నిర్వహణ, చేతి పరిశుభ్రత క్యాంపు నిర్వహణ, ఫింగర్ పెయింటింగ్ పోటీ నిర్వహణ, అతిపెద్ద మానవహారం నిర్వహణ, కూరగాయలతో బొమ్మల పోటీ నిర్వహణ, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్టర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి.
కానీ, అనుహ్యంగా ఆయనపై అత్యాచార కేసు నమోదు కావడం, ఆ కేసులో సిబిఐ కోర్టు దోషిగా శుక్రవారం నాడు తేల్చింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications