పాక్‌, బంగ్లాదేశ్ సైన్యానికి స్వీట్ల‌ను పంచి పెట్టిన బీఎస్ఎఫ్ జ‌వాన్లు

న్యూఢిల్లీ: భార‌త స‌రిహ‌ద్దు భ‌ద్రతా బ‌ల‌గాలు ప‌విత్ర రంజాన్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బుధ‌వారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ సైనికుల‌కు స్వీట్ల‌ను పంచి పెట్టాయి. పంజాబ్‌, ప‌శ్చిమ బెంగాల్‌ల‌ల్లో పాకిస్తాన్‌, బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లో ఈ దృశ్యాలు క‌నిపించాయి.

రంజాన్ పండగ సంద‌ర్భంగా పంజాబ్‌లోని అట్టారీ-వాఘా స‌రిహ‌ద్దులో విధి నిర్వ‌హ‌ణ‌లో నిమ‌గ్న‌మైన మ‌న‌దేశ స‌రిహ‌ద్దు ద‌ళానికి చెందిన జ‌వాన్లు పాకిస్తాన్ వైపు ప‌హారా కాస్తోన్న ఆ దేశ సైనికుల‌ను జీరో పాయింట్ ప్ర‌దేశానికి ఆహ్వానించారు. రంజాన్ శుభాకాంక్ష‌లు తెలిపారు. వారికి స్వీట్ పాకెట్ల‌ను అంద‌జేశారు. దీనికి ప్ర‌తిగా- పాకిస్తాన్ సైనికులు కూడా మ‌న దేశ బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌కు స్వీట్ల‌ను పంచి పెట్టారు. అనంత‌రం ప‌ర‌స్ప‌రం ఆలింగ‌నం చేసుకుని పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Ramadan: BSF personnel exchange sweets at borders with Pakistan, Bangladesh

ఇదే త‌ర‌హా స‌న్నివేశాలు ప‌శ్చిమ బెంగాల్‌లోని సిలిగురి స‌మీపంలో బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల్లోనూ క‌నిపించాయి. సిలిగురి జిల్లా ఫుల్బ‌రీ స‌మీపంలో భార‌త్‌-బంగ్లాదేశ్ స‌రిహ‌ద్దుల వ‌ద్ద బీఎస్ఎఫ్ జ‌వాన్లు బంగ్లాదేశ సైన్యానికి స్వీట్ల బాక్సుల‌ను పంచి పెట్టారు. వారికి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+