తెలుగమ్మాయి పెళ్లికి ట్రంప్ కొడుకు, జెన్నిఫర్ లోపెజ్, జస్టిన్ బీబర్..!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజం. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఖర్చుతో జరిగిన పెళ్లిళ్ల విషయానికి వస్తే ముందుగా గుర్తొచ్చేది అనంత్ అంబానీ వివాహం. ఆ తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం.. దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత దత్తపుత్రుడు వివాహం. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లిళ్లు ఒక ఎత్తైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే వివాహం కూడా ఆ రేంజ్ లోనే జరుగుతుంది. ఈ మ్యారేజ్‌కి ప్ర‌పంచన‌లుమూల నుంచి అతిథులు రావడం హాట్ టాపిక్ గా మారింది.

ఉదయపూర్‌లో సెలబ్రిటీ వెడ్డింగ్..

అమెరికాలో భారీ ఫార్మా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న రామరాజు మంతెన.. కుమార్తె నేత్ర మంతెన వివాహం చేసుకోబోతుంది. ఆమె పలు టెక్ ప్రాజెక్టుల్లో ప‌నిచేస్తోంది. బిలియనీర్ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్ మూలాలున్న వ్యక్తి. ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్, సీఈవోగా ఉన్నారు. ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ICORE Healthcare, Onco Scripts వంటి గ్లోబల్ హెల్త్ కేర్ వెంచర్లకూ యజమాని. యునైటెడ్ స్టేట్స్, స్విట్జర్లాండ్, భారతదేశం అంతటా విస్తరించి ఉన్న వ్యాపారాలతో ప్రపంచ ఫార్మా రంగంలో ఒక లెజెండ్ అని చెప్పొచ్చు.

ramaraju-mantena-daughter-netra-mantena-marriage-news-got-viral

ఇక వరుడి వివరాలకొస్తే.. వంశీ గాదిరాజు. టెక్కీగా చేస్తున్న ఆయన సూపర్‌ ఆర్డర్ సహవ్యవస్థాపకుడు, కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. కొలంబియా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో పట్టా పొందారు. ఇతని కంపెనీ ప్రఖ్యాత సూపర్ ఆర్డర్ అనే యాప్ ను రూపొందించింది. 2024లో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో (Food & Drink category) చోటు సంపాదించాడు. ప్రస్తుతం సూపర్ ఆర్డర్ విలువ $18-25 మిలియన్ల మధ్య ఉండొచ్చని అంచనా.

ఇక ఈ వేడుక నవంబర్ 21 నుంచి 24 వరకు సాగనుంది. "లేక్ సిటీ"గా ప్రసిద్ధి చెందిన‌ రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ పెళ్లికి ట్రంప్ తనయుడితో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ జెన్నిఫర్ లోపెజ్, జస్టిస్ బీబర్.. బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, రణ్ వీర్ సింగ్ వంటి అనేక మంది తారలు ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవుతున్నారు.

కాగా వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌‌గా జరగనున్న ఈ పెళ్లి వేడుక.. పిచోలా సరస్సుపై రాజ వైభవానికి ప్రతీకైన జగ్‌మందిర్ ఐలాండ్ ప్యాలెస్‌లలో జరుగుతోంది. చారిత్రాత్మక సిటీ ప్యాలెస్‌లోని లీలా ప్యాలెస్ మానెక్ చౌక్, జెనానా మహళ్లలో ఇతర కార్యక్రమాలు జరగనున్నాయి. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+