చేతులనే తినేశారు: మోడీపై రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: సినీ ప్రముఖుడు రామ్ గోపాల్ వర్మకు వ్యంగ్య బాణాలు విసరడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన ఎవరినీ వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తూనే ఉంటారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ పేరును ఆయన వ్యాఖ్యల్లో ఎక్కడా ప్రస్తావించలేదు.
అయితే మోడీని ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధాని అని గానీ నరేంద్ర మోడీ అనీ గానీ ఆయన ఎక్కడా చెప్పలేదు. మోడీ అనే అర్థం స్ఫుర్తించే విధంగా రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఆయనను హీరోగా చేసిందని, తనకు కూడు పెట్టిన సోషల్ మీడియా చేతులనే ఆయన తినేశారని వర్మ అన్నారు.

ఇప్పుడు అదే సోషల్ మీడియా ఆయన రెండు చేతులనూ తినేయడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో మోడీ విపరీతంగా నడిచిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా యువత, విద్యావంతులు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా మోడీ అభిమానులుగా మారిపోయారు.
ఇప్పుడు అశ్లీల చిత్రాల సైట్లను నిషేధించడం ఆ సోషల్ మీడియా ఫాలోయర్కు ఇబ్బంది అన్నది రామ్ గోపాల్ వర్మ మాటల అంతరార్థంగా కనిపిస్తోంది.
-
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications