వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గతంలో ఇద్దరూ బానిసలే..: పన్నీర్-శశికళపై వర్మ సెటైర్

తమిళ రాజకీయాలను చూస్తుంటే.. 'యూ టూ బ్రూటస్?' అనే పాత రోమన్ సామెత గుర్తుకు వస్తోందన్నారు రాంగోపాల్ వర్మ.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ రాజకీయాల్లో నాటకీయత పాళ్లు సినిమాలను, సీరియళ్లను తలదన్నే రీతిలో సాగుతున్న తరుణంలో.. ఎప్పుడూ వివాదాలతోనే సహవాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మకు ట్విట్టర్ మోత మోగించడానికి మరో మసాలా అంశం దొరికినట్టయింది.

Ramgopal varma satirical comments on tamilnadu politics

తాజాగా ట్విట్టర్ వేదికగా తమిళ ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ పైన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. తమిళ రాజకీయాలను చూస్తుంటే.. 'యూ టూ బ్రూటస్?' అనే పాత రోమన్ సామెత గుర్తుకు వస్తోందన్నారు.

'గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని శశికళ ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారని, కానీ ఆమె మరిచిపోతున్న విషయమేంటంటే.. గతంలో తాను కూడా ఓ బానిసనేనని' అంటూ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద ఓ బానిస తిరగబడ్డాడని శశికళ భావిస్తుందే తప్ప గతంలో ఆమె కూడా ఒకలాంటి బానిసే అని వర్మ గుర్తుచేశారన్నమాట.

English summary
Controversial director Ramgopal Varma made some satires on Tamilnadu politics. he tweeted like this 'Sasikala would be remeniscing the times OPS behaved like slave but would conveniently forget how she herself behaved like a slave in past'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X