బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'బొమ్మ' చూపించారు!: మోడీ పాలనపై నటి రమ్య పోస్ట్‌లు, దిమ్మతిరిగేలా కౌంటర్లు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు, ఆ పార్టీ ఐటీ సెల్ ఇంచార్జ్ రమ్య అలియాస్ దివ్య స్పందన మంగళవారం మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పద ట్వీట్లు చేసి విమర్శల పాలయ్యారు. ఆమె ట్వీట్ల పైన నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు. ఈ మేరకు ఆమె మోడీ గురించి, మోడీ పాలన గురించి రెండు ట్వీట్లు చేశారు.

బలంగా తయారు చేస్తానని... బొమ్మ చూపించారు!

తొలుత 2014లో నరేంద్ర మోడీ హామీ ఇలా ఉంది, 2019లో ఇలా తయారయిందంటూ ఓ ట్వీట్ పెట్టారు. ఓ గుర్రం లాంటి బొమ్మను వేసి.. వెనుక వైపు ఓ భాగం, ముందు వైపు ఓ భాగంగా పేర్కొంటూ.. వెనుకవైపు బలంగా ఉన్న రెండు కాళ్లు, తోక ఉన్న దానిని చూపిస్తూ... 2014లో మోడీ ఇలా హామీ ఇచ్చారని రమ్య పేర్కొన్నారు. దానికి ముందు వైపు ఉత్తి బొమ్మను ఉంచారు. మోడీ అప్పుడు అది చూపించి, ఇప్పుడు ఇలా తయారు చేశారని అభిప్రాయపడ్డారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగానే స్పందించారు.

పప్పు ఫ్లాప్

అసలు రాహుల్ గాంధీ 2014లో అలా, ఇప్పుడు ఇలా తయారయ్యారని మరొకరు కామెంట్ చేశారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు బలంగా చూస్తుంటే, ప్రపంచం మాత్రం ఆయనను బలం లేనివాడిగా చూపిస్తుందని మరొకరు రమ్య పోస్టుకు కామెంట్స్ పెట్టారు. కొందరు రెండు వైపులా బొమ్మనే వేసి.. 2014లో పప్పు ఫ్లాప్ అయ్యాక, 2019లో పప్పు ఫ్లాప్ అయ్యాక అంటూ పేర్కొన్నారు. వెనుక భాగం కాంగ్రెస్ వాళ్లు ఊహించుకునే రాహుల్ గాంధీ అని, ముందు భాగం అసలు రాహుల్ గాంధీ అని కౌంటర్లు ఇస్తున్నారు.

రమ్యకు కౌంటర్

నెహ్రూ మొదలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వరకు ఇలా ఉందని అదే ఇమేజ్‌కు కౌంటర్ ఇచ్చారు. తోక, బలమైన కాళ్లు నెహ్రూగా, ఆ తర్వాత భాగాన్ని ఇందిర పాలనగా, తదనంతర పాలనను రాజీవ్ గాంధీ పాలనగా చూపించారు. చివరగా ఉన్న బొమ్మవంటి బలహీనమైన దానిని రాహుల్ గాంధీగా పేర్కొన్నారు. కొందరు రాహుల్ గాంధీని లేడీ పప్పు అన్నారు.

మోడీ తప్పులు

మరో వీడియోలో నరేంద్ర మోడీ మిస్టేక్స్ అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. కింగ్ ఆఫ్ బ్లూపర్స్ కిరీటాన్ని మోడీ దక్కించుకున్నారని ఎద్దేవా చేస్తూ ఈ పోస్ట్ చేశారు. మోడీ బెస్ట్ వన్ మిస్టేక్స్ అంటూ ''మోహన్ లాల్ కరమ్ చంద్ గాంధీ' (మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీకి బదులు) అన్నారు. దాంతో పాటు మరో మూడు నాలుగు మిస్టేక్స్ ఉన్నాయి. ఈ వీడియోను పోస్ట్ చేశారు.

English summary
Congress leader and party IT cell incharge Ramya alias Divya Spandana comments on Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X