మైక్రో బ్లాగింగ్ పేజీల్లో క్లాస్ తీసుకుంటున్న నటి రమ్య!

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ రమ్య దివ్య స్పందన టీచర్‌గా మారింది! కన్నడ పదాలు తప్పుగా రాయడం లేదా తప్పుగా పలకడం చేస్తుంటే ఆమె మైక్రో బ్లాగింగ్ పేజీల్లో సూచనలు చేస్తున్నారు. కన్నడను, కర్నాటకను స్వచ్ఛంగా పలకని వారిని ఉద్దేశిస్తూ ఆమె ఓ ట్వీట్ చేశారు.

కెనడా అనే పదాన్ని స్వచ్ఛంగా పలకగలిగినప్పుడు.. కన్నడను ఎందుకు పలకలేరని ఆమె ట్వీట్ చేశారు. ఉత్తరాది వారు ఎక్కువగా కర్నాటక్, కన్నడ్ అంటూ ఉంటారట. దీనిని ఉద్దేశిస్తూ ఆమె మరో ట్వీట్ చేశారు. ఉత్తరాది స్నేహితులకు.. అంటూ ఆమె ట్వీట్ ప్రారంభించారు.

Ramya turns Kannada tutor

కర్నాటక్ కాదు.. కర్నాటక, ఆంగ్ల భాషలో చివరలో 'ఏ' ఉంటుందని, అలాగే కన్నడ్ కాదని, కన్నడ అంటూ ఆమె నొక్కి చెప్పినట్లుగా ట్వీట్ చేశారు. కర్నాటక, కన్నడల విషయంలో రమ్య ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఆమెకు రాష్ట్రం పట్ల, భాష పట్ల ఉన్న గౌరవం దీని ద్వారా అర్థమవుతోందని అభిమానులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+