వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులులతో రమ్య! డిమాండ్ కాదని మోడీకి సంజన ట్వీట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ కన్నడ నటీ, మాజీ మాండ్య పార్లమెంటు సభ్యురాలు రమ్య అలియాస్ దివ్య స్పందన సామాజిక అంశాల పైన దృష్టి సారించారు. అడవులలో పులులు క్రమంగా అంతరించిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల న్యూస్ చానల్ తరఫున ఆమె పులులను రక్షించేందుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నారు.

పులుల రక్షణ కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న రమ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... పులులను రక్షించాలని, చిన్న పులులతో ఓ రోజు గడిపినట్లు ట్వీట్ చేశారు. ప్రచారంలో భాగంగా రమ్య పాఠశాల విద్యార్థులతో ఓ రోజు గడిపారు. విద్యార్థులు పులుల వేషం వేసుకున్నారు.

Ramya turns tigress, spends a day with children

మరోవైపు, ప్రముఖ నటి సంజన అర్చన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యాచారాలు, చైల్డ్ లైపర్ పైన విజ్ఞప్తి చేశారు. అత్యాచారాల పైన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.

నరేంద్ర మోడీ సర్.. ట్విట్టర్ ద్వారా మాత్రమే తాను మీకు నా అభిప్రాయాన్ని, ఆలోచనలను చెప్పగలనని చెప్పిన సంజన... తాను ఓ సామాన్య పౌరురాలినని, తాను డిమాండ్ చేయడం లేదని, కానీ అత్యాచారాలు, చైల్డ్ లేబర్ అంశాలకు సమాధానం కనుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్ చేశారు.

English summary
Kannada actress Sanjana tweet request to Prime Minister Narendra Modi on rape and child labor issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X