రేప్ ఎంజాయ్ చేయాలి: సిబిఐ డైరెక్టర్‌కు సామెత చిక్కు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) డైరెక్టర్ రంజిత్ సిన్హా చిక్కుల్లో పడ్డారు! రేప్‌ను కట్టడి చేయలేనప్పుడు ఎంజాయ్ చేయాలన్న ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. బెట్టింగ్‌లపై ఓ సంస్థ నిర్వహించిన డిబేట్‌లో మంగళవారం పాల్గొన్న రంజిత్ సిన్హా బెట్టింగులను అరికట్టడం సాధ్యం కానప్పుడు, దానిని చట్టబద్దం చేయడమే మేలన్నారు.
ఈ సందర్భంగా అత్యాచారానికి సంబంధించిన అంశాన్ని ఓ సామెతలా ఉపయోగించారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

అత్యాచారాన్ని అపలేనప్పుడు దానిని అనుభవించడంమేలని సిన్హా ఓ సామెతలా మాట్లాడినప్పటికీ మహిళా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
లెఫ్ట్ పార్టీ నాయకురాలు బృందాకారత్ తదితరులు డైరెక్టర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ డైరెక్టర్ పైన కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయన్నారు. పదవిలో కొనసాగేందుకు ఆయన అనర్హుడన్నారు.
కాగా, విమర్శలు వస్తుండటంతో దానిపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నాలు చేశారు. తాను దానిని ఓ సామెతలా మాత్రమే వాడానని, తనకు లింగ వివక్ష లేదని, దానికి తాను వ్యతిరేకమని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications