నటి రంజిత సన్యాసం: మా ఆనందమయి అవతారం

గత నాలుగేళ్లుగా ఆమె స్వామి నిత్యానంద వద్ద శిష్యరికం చేస్తున్నారు. స్వామి నిత్యానందతో రంజిత శారీరక సంబంధం పెట్టుకుందంటూ విడుదలైన వీడియోలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అది మార్ఫింగ్ చేసిన వీడియోగా తర్వాత తేలింది.
వీడియో విడుదలైన తర్వాత కూడా ఆమె ఆశ్రమంలో పలు మత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రంజితకు ఆశ్రమం విదేశీ శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి శేష జీవితం ఆమె ఆశ్రమంలోనే గడుపుతారని అంటున్నారు.
సన్యాసిని ఆర్హతలు రంజితకు లేవని నాగనూరు మఠం బసవ గీత మాత అంటున్నారు. సన్యాసి కావడం సాధనతో కూడిందని ఆమె అన్నారు. ఆడంబరమైన జీవితం గడిపినవారు రాత్రికి రాత్రి సన్యాసులు కావడం అసాధ్యమని అన్నారు. దానికి ధ్యానం, మత కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు.












Click it and Unblock the Notifications