రాకింగ్ స్టెప్పులేసిన మాజీ సీఎం ఫరూక్(వీడియో)
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా తనలో ఇంకా ఉరిమే ఉత్సాహం ఉందని నిరూపించుకున్నారు. రాజకీయాల్లో నిష్ణాతుడిగానే గాక, డ్యాన్సులు చేయంలోనూ తక్కువ కాదని చెప్పారు. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఆయన ఓ పాటకు స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపర్చారు.
వివరాల్లోకి వెళితే.. జాతీయ వార్తా ఛానెల్ ఎన్డీటీవీ మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రణ్‌వీర్‌సింగ్‌కి ‘ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' ప్రకటించారు.
ఈ అవార్డును రణ్‌వీర్‌కి ఫరూక్ అబ్దుల్లా ప్రదానం చేయాల్సిందిగా వ్యాఖ్యాత కోరారు. దీంతో అవార్డు ప్రదానం చేయడానికి వచ్చిన ఫరూక్.. సరదాగా రణ్‌వీర్‌తో కలిసి ‘బాజీరావ్ మస్తానీ' చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్ చేశారు. దీంతో సభా ప్రాంగణం అంతా చప్పట్లు, కేకలతో మార్మోగిపోయింది.
ఈ సందర్భంగా రణవీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘ మీరు కనుక నటుడు అయ్యుంటే.. అమితాబచ్చన్‌కి ఇబ్బందిగా ఉండేది' అని ఫరూక్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాక్‌స్టార్ అంటూ కొనియాడారు. దీనికి స్పందించిన ఫరూక్.. ‘నాకు నటన అంటే ఇష్టం. ఈ జన్మలో అది కుదరలేదు. వచ్చే జన్మలో ప్రయత్నిస్తా'నని తన మనసులో మాట బయటపెట్టారు. కాగా, ఫరూక్ డ్యాన్స్ వీడియోను ఇప్పటికే 7లక్షల మంది వీక్షించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications