రేప్ కేసు నిందితుడు: పరారీలో ఐఎఎస్ మొహంతీ

Rape accused IAS officer declared absconder
జైపూర్: అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుని సస్పెన్షన్‌కు గురైన ఐఎఎస్ అధికారి బిబి మొహంతి పరారీలో ఉన్నట్లు స్థానిక కోర్టు ప్రకటించి, అతని కోసం అరెస్టు వారంట్ జారీ చేసింది. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఓ 22 ఏళ్ల యువతిపై అతను అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

జూన్ 18వ తేదీన మొహంతి కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే,త ఆయన హాజరు కాకపోవడంతో అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అతని అరెస్టుకు వారంట్ జారీ చేసింది. మహేష్ నగర్ పోలీసు స్టేషన్‌లో మొహంతీపై కేసు నమోదైంది.

మొహంతి అరెస్టుకు కోర్టు ఫిబ్రవరిలోనే అరెస్టు వారంట్ చేసింది. అయితే అప్పటి నుంచి కూడా అతను అరెస్టు నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు.

ఐఎఎస్ పరీక్షలకు సహాయం చేస్తానని నమ్మించి 22 ఏళ్ల యువతిపై మొహంతి ఏడాది పాటు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆయన రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+