రేప్ చేశాడు: కాళ్లు పట్టించి వదిలేశారు
లక్నో: అత్యాచారానికి గురైన బాధితురాలికి ఉత్తరప్రదేశ్ లో మళ్లీ అన్యాయం జరిగింది. పంచాయితీ పెద్దలు నేరం చేసిన కామాంధుడికి ఇక ముందు ఇలా చెయ్యరాదంటూ బుద్దిమాటలు చెప్పి బాధితురాలి కాళ్లు ముక్కించి వదిలి పెట్టి చేతులు దులుపుకున్నారు.
ఈ విషయం ఇంతటిలో వదిలిపెట్టాలని, పోలీసులు, కేసు అంటూ తిరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆమెను హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ లోని బరేలి జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఓ వితంతువు (30) నివాసం ఉంటున్నది.
2016 జనవరి 28వ తేదిన ఒంటిరిగా ఉన్న ఆమె మీద అదే గ్రామానికి చెందిన ఓ కామాంధుడు లైంగికదాడి చేశాడు. అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారైనాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి బయలుదేరింది. గ్రామ పెద్దలకు (ప్రధాన్ లు) విషయం తెలిసింది.

వెంటనే పోలీస్ స్టేషన్ సమీపంలో బాధితురాలిని అడ్డుకున్నారు. అక్కడే పంచాయితీ నిర్వహించారు. బాధితుడిని పిలిపించి ఆమె కాళ్లు పట్టించి వదిలి పెట్టారు. ఈ ఘటనపై ఇక ముందు నీవు పోలీసులకు ఫిర్యాదు చెయ్యరాదని ఆమెను హెచ్చరించారు.
అయితే బాధితురాలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి వైద్య పరిక్షలు నిర్వహించారు. నిందితుడు పరారైనాడని, పంచాయితీ చేసిన పెద్దల గురించి ఆరా తీస్తున్నామని బరేలి జిల్లా పోలీసు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications