ఫేస్ బుక్ ఫ్రెండ్: సంగీతం నేర్పిస్తా రా, పదేపదే అత్యాచారం, వీడియోలు, బ్లాక్ మెయిల్!
బెంగళూరు: ఫేస్ బుక్ లో యువతిని పరిచయం చేసుకుని ఇంటికి వస్తే సంగీతం నేర్పిస్తానని నమ్మించి మోసం చేసి అత్యాచారం చేసిన ఘటన బెంగళూరు నగరంలోని జ్ఞానభారతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి పదేపదే అత్యాచారం చేశాడు ఓ కామాంధుడు.
బెంగళూరు నగరంలోని ఉల్లాల ఉపనగర్ లో నివాసం ఉంటున్న మంజునాథ్ అలియాస్ కరణ్ మహదేవప్ప అనే యువకుడు ఫేస్ బుక్ లో మైసూరు రోడ్డులోని బ్యాటరాయనపురలో నివాసం ఉంటున్న యువతి (24)ని ఫేస్ బుక్ లో పరిచయం చేసుకున్నాడు.

ఫేస్ బుక్ లో యువతితో చనువు పెంచుకున్న కరణ్ తన ఇంటిలో రికార్డింగ్ స్టూడియో ఉందని, తాను సంగీతం నేర్పిస్తానని, నీకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం వస్తోందని ఆమెను నమ్మించాడు. ఇలా యువతిని నమ్మించిన కరణ్ ఆమెను ఇంటికి పిలిపించుకున్నాడు.
యువతితో సన్నిహితంగా ఉన్న కరణ్ ఆమెను లైంగికంగా లొంగదీసుకున్నాడు. యువతితో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు, ఫోటోలు తీసిన కరణ్ తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. తాను చెప్పినప్పుడు ఇంటికి రావాలని, తనకు లైంగిక కోరికలు తీర్చాలని ఆమెను వేధింపులకు గురిచేశాడు.
యువతి రానని చెప్పడంతో వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతానని కరణ్ ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. బాధితురాలు ధైర్యం చేసి కరణ్ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పరారైన కరణ్ కోసం గాలిస్తున్నారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications