Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోల్‌కతా డాక్టర్ అత్యాచారం హత్య:మమతా పాలనలో చీకటి అధ్యాయం..!!

కోల్‌కతా అత్యాచారం హత్య కేసును విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కఠినంగా వ్యవహరించింది. ఇంకా మరో అత్యాచారం జరగకముందే వ్యవస్థలు మేలుకోవాలని సూచించింది. ఇక కేసును డీల్ చేయడంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లోపభూయిష్ట విధానంతో వ్యవహరించిందని అత్యున్నత ధర్మాసనం తేల్చేసింది. కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రిని ధ్వంసం చేయడానికి మమత సర్కార్ ఎలా అనుమతించిందని కోర్టు ప్రశ్నించింది. నేరం జరిగిన వెంటనే సాక్ష్యాలను భద్రపరచడం పోలీసుల విధి అని పేర్కొన్న న్యాయస్థానం, అత్యాచారం జరిగితే కళాశాల ప్రిన్సిపాల్ దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని వెల్లడించింది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయడంలో జాప్యం, మృతురాలి తల్లిదండ్రులను అనుమతించకపోవడం చాలా క్రూరత్వం అని ధర్మాసనం అభిప్రాయపడింది.ఇవన్నీ పరిశీలిస్తే ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం, మమతా బెనర్జీ ప్రభుత్వం వైఫల్యంగా కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థాన పేర్కొంది. ఆస్పత్రి యాజమాన్యంపై సీరియస్‌ అయ్యింది సుప్రీంకోర్టు.

నేరం జరిగిన తర్వాత...

కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో ఓ మహిళా జూనియర్ డాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అది ఆత్మహత్య అని అంతా భావించారు. అయితే క్రమంగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆమెపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు దుర్మార్గులు.ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Rape and Murder of Kolkata Doctor A Grim Reflection on West Bengals Governance

మమతా బెనర్జీ ద్వంద్వ వైఖరి

ఒక మహిళా డాక్టర్ పై ఇలాంటి ఘటన జరిగిందంటే ఒక సీఎంగా ఆరోగ్య శాఖ మంత్రిగా మమతా బెనర్జీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇందుకు భిన్నంగా టీఎంసీ ప్రభుత్వం వైఫల్యంపై మమతా బెనర్జీనే నిరసన చేపట్టడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మమతా బెనర్జీ కేసును సీబీఐకి అప్పగించడం స్వాగతించాల్సిన విషయం కాదు. ఫాస్ట్ ట్రాక్ సీబీఐ విచారణకు మమత డిమాండ్ చేయడం అది కూడా ఎలాంటి డెడ్ లైన్ ఇవ్వకపోవడాన్ని రాజకీయ స్టంట్‌గా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకానీ ఘటనకు సంబంధించి న్యాయం కోసం పోరాడే దాఖలాలు మమత బెనర్జీలో కనిపించడం లేదని చెబుతున్నారు.

ఆరోపణలపై మమత దాటవేసే ధోరణి

ఇక ఆస్పత్రి ఆవరణలో అర్థరాత్రి వేళ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లకు పాల్పడింది అధికారిక టీఎంసీ మద్దతుదారులే అనేది స్పష్టమవుతోంది. తమ సహచర డాక్టరుకు న్యాయం జరగాలంటూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న డాక్టర్లపై అల్లరి మూకలు దాడి చేశాయి.అంతేకాదు ఆస్పత్రి లోపలికి ప్రవేశించి సాక్ష్యాధారాలను ధ్వంసం చేశారు. విచారణను అడ్డుకునేందుకే ఇలాంటి దాడులు చేశారని స్పష్టమవుతోంది. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తే ఈ దాడులు చేసిన వారు టీఎంసీ నేతలకు సన్నిహితులని తేలింది.దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.

అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో..

అత్యాచార ఘటనపై జరుగుతున్న విచారణ తీరు చూస్తే పలు ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు బాధితురాలి మృతదేహం వెంటనే తల్లిదండ్రులకు చూపేందుకు ఎందుకు నిరాకరించారు, జాప్యం ఎందుకు చేశారు, ఆలస్యం చేయాల్సిందిగా ఎవరు ఆదేశించారు..?

అంత రహస్యంగా ఎందుకు ఉంచారు, నేరం జరిగిన చోట అసలు ఏం జరిగింది..?

నేరం జరిగిన చోటే అత్యవసరంగా మెయిన్‌టెనెన్స్ పనుల పేరుతో క్రైమ్ సీన్‌ను ఎందుకు టాంపర్ చేయాలని చూశారు..?

ఘటనలో అనుమానితుడిగా ఉన్న సంజయ్ రాయ్‌ను కేవలం పావుగా చూపి అసలైన నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య వెనుక మెడిసిన్ మాఫియా హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ వెనక ప్రభుత్వంలోని పెద్దల హస్తం కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇక మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ పై కఠిన చర్యలు తీసుకోకపోవడం, అప్పటికే అతనిపై అవినీతి ఆరోపణలు ఉండటం, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడంలాంటివి బలం చేకూరుస్తున్నాయి.

ఎవరు బాధ్యత వహిస్తారు..

విచారణ జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలతో పాటు దేశం యావత్తు ఈ ఘటనను చాలా దగ్గరగా చూస్తున్నారు. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు, ప్రభుత్వ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీకి ఇదొక అగ్ని పరీక్షగా మారింది. ఇప్పటికే మమతా బెనర్జీ పూర్తిగా వైఫల్యం చెందారనే అంశం స్పష్టమవుతోంది.

చివరిగా..

జూనియర్ డాక్టర్ పై అత్యాచారం ఆపై హత్య ఘటన ఎన్నో అనుమానాలకు తావిచ్చింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శాంతిభద్రత విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే చెప్పాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమైంది. మరోవైపు బాధితురాలికి ఆమె కుటుంబానికి న్యాయం జరగడంతో పాటు, అధికారంలో ఉన్న బలవంతులు ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడినా వారిని వదిలేయ కుండా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+