రేప్: మోడల్‌పై యాక్టర్ ఇందర్ భార్య పల్లవి విసుర్లు

ముంబై: మోడల్‌పై అత్యాచారం కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్‌కు భార్య పల్లవి షరాప్ బాసటగా నిలిచారు. తన భర్త అరెస్టయిన చాలా రోజులకు ఆమె మౌనం వీడారు. తన భర్తను సమర్థిస్తూ పల్లవి - తన భర్త కాలు జారాడని, ఏ పురుషుడి విషయంలోనైనా ఇది జరుగుతుందని అన్నారు.

తన భర్త కాలు జారాడని తాను అంగీకరిస్తానని, ఎవరూ ఇక్కడ సన్యాసులు లేరని, పరిశ్రమలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారని, కొన్ని సంబంధాలు బయటకు వస్తాయని, కొన్ని వెలుగు చూడవని ఆమె మీడియాతో అన్నారు. తన భర్తను దెబ్బ తీయాలనే ప్రయత్నం దురదృష్టకరమని ఆమె అ్నారు.

Rape: Any man would do this, says Bollywood actor Inder Kumar's wife

తన భర్తపై అత్యాచారం ఆరోపణలు చేసిన మోడల్‌పై ఆమె వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మోడల్ అబద్ధాలు చెబుతోందని అన్నారు. 23, 24 తేదీల్లో అత్యాచారం జరిగిందని ఆమె చెబుతోందని, నిర్బంధించి అత్యాచారానికి గురైనప్పుడు అపార్టుమెంటు లోపలికీ బయటకూ తిరిగే అవకాశం ఉండదని, అలా బయటకు వెళ్ల మద్యం తెచ్చుకోలేరని, పార్టీ చేసుకోలేరని, బయటి నుంచి ఆహారం ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోలేరని పల్లవి అన్నారు.

మోడల్ 24వ తేదీ ఆ పని చేసిందని, ఇందర్ తన మణికట్టును కోసుకున్నప్పుడు ఆమె తన తల్లి వద్దకు పరుగెత్తుకుని వచ్చిందని, దాంతో తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని, వారు వచ్చిన తీసుకుని వెళ్లారని, తాను పోలీసులను పిలువలేదనే విషయంలో నిజం లేదని పల్లవి వివరించారు.

తన భర్త ప్రాణాలను కాపాడడానికి తాను పోలీసులను పిలిచానని, తనపై ఇదివరకే అత్యాచారం జరిగితే అమ్మాయి పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదని ఆమె అన్నారు. ఇందర్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసి ఏప్రిల్ 30వ తేదీ వరకు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మోడల్ అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఇందర్ కుమార్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+