రేప్ కేసులో కేరళ ఎమ్మెల్యే అరెస్టు: బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పిన కోర్టు !
ఆంటీని రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ కేరళ ఎమ్మెల్యే బలమైన సాక్షాలు ఉన్నాయని చెప్పిన కోర్టు బెయిల్ ఇవ్వలేం, ఎమ్మెల్యేకి షాక్
కొచ్చి: సీపీఎం నాయకురాలు, 51 ఏళ్ల వివాహిత మహిళ మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ అరెస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ కు బెయిల్ ఇవ్వలేమని తిరువనంతపురం కోర్టు తేల్చి చెప్పింది. ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
కేరళలోని కోవలం నియోజక వర్గం శాసన సభ్యుడు ఎం. విన్సెంట్ 51 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను శనివారం రాత్రి కేరళ పోలీసు క్లబ్ లో ఆరు గంటల పాటు విచారణ చేసి అక్కడే అరెస్టు చేశారు.

మరసటి రోజు ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ను 14 రోజులు రిమాండ్ కు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ట్రైల్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తిరువనంతపురం జిల్లా సెషన్స్ కోర్టులో మళ్లీ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేస్తామని ఎమ్మెల్యే ఎం. విన్సెంట్ న్యాయవాది తెలిపారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications