ప్రేమించి.. స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, హత్య..

ఇలా ఓవైపు పోలీసు విచారణ కొనసాగుతుండగానే.. సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న కీళ్లమాడిగై గ్రామస్థులకు ఊరి బయట బావిలో ఓ బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరి

: 17ఏళ్ల బాలికతో ప్రేమాయణం నడిపి.. ఆపై స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్, హత్యకు పాల్పడిన ఘటన అరియలూరు జిల్లా సెంధురై గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు తొలుత తనకేమి తెలియదంటూ బుకాయించినా.. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపెట్టాడు.

పోలీసులు కథనం ప్రకారం.. సెంధురై సమీప గ్రామానికి చెందిన నందిని(17) కీళ్లమాడిగై గ్రామానికి చెందిన హిందూ మున్నని నేత మణికంఠన్‌తో ఏడాది కాలంగా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇదే క్రమంలో గత డిసెంబర్ 26న బాలిక అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించింది.

ఫిర్యాదులో మణికంఠనే కిడ్నాప్ చేసినట్టుగా ఆరోపించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు మణికంఠన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా..నందిని ఎక్కడికెళ్లిందో తనకేమి తెలియదని చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులు అతన్ని వదిలిపెట్టారు.

Rape and Murder by hindu Munnani leader

ఇలా ఓవైపు పోలీసు విచారణ కొనసాగుతుండగానే.. సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్న కీళ్లమాడిగై గ్రామస్థులకు ఊరి బయట బావిలో ఓ బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలించారు. అత్యాచారం జరిపి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు.

అనంతరం మరోసారి మణికంఠన్ ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. దీంతో అసలు నిజం ఒప్పేసుకున్నాడు. స్నేహితులతో కలిసి అత్యాచారం చేశానని, నందిని ఈ విషయం ఎక్కడ బయటకు చెప్తుందోనని ఆమె హత్య చేసినట్టు చెప్పాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో అతనితో పాటు అతడి స్నేహితులైన మణివన్నన్, మణికంఠన్, రాజదురై, వెట్రిసెల్వంలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+