యూనివర్శిటీ క్యాంపస్ లో కాలేజ్ విద్యార్ధినిపై అత్యాచారం, కామాంధులు!

బెంగళూరు: కాలేజ్ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేసిన కేసులో కర్ణాటకలోని కులబర్గి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కాలేజ్ అమ్మాయిని వైద్య పరీక్షలకు తరలించామని కులబర్గి పోలీసులు తెలిపారు.

కులబర్గి జిల్లా అళంద తాలుకా కడగంజిలోని సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ కర్ణాటక ( CUK)లో ఓ యువతి నాలుగవ సెమిస్టర్ చదువుతూ అదే కాలేజ్ లోని హాస్టల్ లో నివాసం ఉంటున్నది. డిసెంబర్ 30వ తేదీ (2018) రాత్రి 7 గంటల సమయంలో వంట అయ్యిందా, లేదా అని ఆమె తెలుసుకోవడానికి మెస్ కు వెళ్లింది.

మెస్ లో వంట చేసే అనీల్ అనే వ్యక్తి యువతితో మాట్లాడుతూ సరైన సమాధానం చెప్పకుండా లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆ సందర్బంలో యువతి అనీల్ ను కాలితో తన్ని అక్కడి నుంచి బయటకు వచ్చింది. మెస్ బయట ఉన్న ఉద్యోగి గురు అనే వ్యక్తి యువతిని హాస్టల్ లో వదిలి పెడుతానని చెప్పాడు.

Rape on 4 semester student in the campus of Central University of Karnataka (CUK)

యూనివర్శిటీ ఆవరణంలో నడిచి వెలుతూ నిర్జన ప్రదేశంలో యువతి మీద గురు అత్యాచారం చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ (వీసి) ఎం. మహేశ్వరయ్య మీడియాతో మాట్లాడారు.

యువతి ఫిర్యాదు చేసిన వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చానని వీసి మహేశ్వరయ్య అన్నారు. బాధితురాలి నుంచి పోలీసులు వివరాలు సేకరించారని వీసి మహేశ్వరయ్య చెప్పారు. యువతి ఫిర్యాదు మేరకు అనీల్, గురును అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+