షాకింగ్ : ఆస్పత్రి పార్కింగ్‌లో మహిళపై గ్యాంగ్ రేప్.. ముగ్గురి అరెస్ట్...

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం వెలుగుచూసింది. ఓ ఆస్పత్రి పార్కింగ్ ప్రదేశంలో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై గ్యాంగ్ రేప్‌కి పాల్ప డ్డారు. అక్టోబర్ 30-31న జరిగిన ఈ ఘటన... తాజాగా బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీలోని రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌ని పరామర్శించేందుకు అక్టోబర్ 30వ తేదీ రాత్రి ఓ మహిళ(30) అక్కడికి వెళ్లింది. పేషెంట్‌ను పరామర్శించి తిరిగి వెళ్లే క్రమంలో పార్కింగ్‌లో ఉన్న తన వాహనం వద్దకు వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు,ఓ సెక్యూరిటీ గార్డు ఆమె వద్దకు వచ్చారు. వెరిఫికేషన్ పేరుతో అదే పార్కింగ్ ప్రదేశంలో నిర్మానుష్యంగా ఉన్నచోటుకు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

rape on a woman on in parking lot of delhi hospital three held

బాధితురాలు స్థానిక పోలీసులను ఆశ్రయించి ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనీష్(22),ప్రవీణ్ తివారీ(24),కన్వర్ పాల్(33) అనే ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మాజీ బౌన్సర్లు అని... అదే ఆస్పత్రిలో కొన్నాళ్లు పనిచేశారని తెలిపారు. మరొకరు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఇటీవల ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో కూడా రేప్ ఘటన కలకలం రేపింది. క్షయ వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ మహిళా పేషెంట్‌పై వికాస్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆ మహిళా పేషెంట్... మాట్లాడలేని స్థితిలో ఒక పేపర్‌పై అతని పేరు రాసి తండ్రికి ఇచ్చింది. సైగలతోనే తనపై జరిగిన ఘాతుకాన్ని తండ్రికి వివరించింది. దీంతో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆమెపై లైంగిక దాడి జరగలేదని వెల్లడవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+