కుమార్తెను రేప్ చేశాడు: తండ్రికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, ఉరి తియ్యాలంటున్న ఫ్యామిలీ !

7 ఏళ్ల సొంత కూతురి మీద తండ్రి అత్యాచారంకామాంధుడికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేసిన మైసూరు కోర్టుకుమార్తె ను రేప్ చేసిన వ్యక్తిని ఉరి తీయ్యాలంటున్న సొంత కుటుంబ సభ్యులు

మైసూరు: కుమార్తె మీద అత్యాచారం చేసిన కామాంధుడికి కర్ణాటకలోని మైసూరు కోర్టు కఠిన శిక్ష విధించింది. కామాంధుడికి 10 ఏళ్లు కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచనల తీర్పు చెప్పింది. మైసూరు నగరంలోని గోకులం ప్రాంతంలో నివాసం ఉంటున్న శివశంకర్ (40) అనే కామాంధుడు జైలుకు వెళ్లాడు.

శివశంకర్ కు 7 ఏళ్ల కుమార్తె ఉంది. కుమార్తె ను ఎత్తుకుని ఆడించాల్సిన శివశంకర్ చిన్నారి మీద కన్ను వేశాడు. కన్న కూతురు అని కూడా చూడకుండా 2016 నవంబర్ 24వ తేదిన ఇంటిలో ఆడుకుంటున్న చిన్నారి మీద కామాంధుడు శివశంకర్ అత్యాచారం చేశాడు.

Rape on a daughter The father has been sentenced in Mysuru in Karnataka.

విషయం తెలుసుకున్న మైసూరు నగరంలోని వీవీ పురం పోలీసులు ఫోక్సో చట్టం కింద శివశంకర్ ను అరెస్టు చేశారు. దర్యాప్తు చేసి మైసూరు నగరంలోని 6వ జిల్లా న్యాయస్థానంలో నివేదిక సమర్పించారు. శివశంకర్ కుమార్తె మీద అత్యాచారం చేశాడని రుజువు కావడంతో కామాంధుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేలు జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కన్న కుమార్తె మీద అత్యాచారం చేసిన శివశంకర్ ను ఉరి తియ్యాలని అతని సొంత కుటుంబ సభ్యులే డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+