కేరళలో ఆంటీని రేప్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆత్మహత్యాయత్నం, రాజీకావాలని !
మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కేరళలోని బలరాంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేరళలోని కోవలం శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ మీద అత్యాచారం.
కొచ్చి: మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కేరళలోని బలరాంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కేరళలోని కోవలం శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ మీద అత్యాచారం కేసు నమోదు చేశామని కేరళ పోలీసులు తెలిపారు.
సీపీఎం నాయకురాలు అయిన 51 ఏళ్ల మహిళ మీద అత్యాచారం చెయ్యడంతో గురువారం ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను నెయ్యాంతికెరలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నామని పోలీసులు తెలిపారు.

కోల్లం సిటీ కమిషర్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ మీద రేప్ కేసు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరిపించారని ఆరోపిస్తూ నమోదు అయిన కేసు విచారణ చెయ్యడానికి ప్రత్యేకంగా కోల్లాం నగర పోలీసు కమిషనర్ ఎస్. అజితా బేగంను నియమిస్తూ కేరళ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Recommended Video


నిత్యం ఫోన్లో, చివరికి రేప్ !
ప్రతినిత్యం ఫోన్లో నీచంగా మాట్లాడుతూ తనకు శారీరక సుఖం ఇవ్వాలని తన భార్యను వేదిస్తున్నాడని, చివరికి అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని సీపీఎం నాయకురాలు అయిన బాధిత మహిళ భర్త ఫిర్యాదు చేశారని బలరాంపురం పోలీసులు మీడియాకు చెప్పారు.

ఎమ్మెల్యే అరాచకాలు
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్మెంట్స్ అరాచకాలు ఎక్కువ అయ్యాయని, తన సోదరిని ఆత్యాచారం చెయ్యడం వలనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని బాధిత మహిళ సోదరుడు, సీపీఎం నాయకుడు ఫెడ్రిక్ షాజి ఫిర్యాదు చేశాడని పోలీసులు చెప్పారు.

ఆసుపత్రిలో ఆమె చెప్పింది
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ దగ్గరకు వెళ్లిన కోల్లం నగర పోలీసు కమిషనర్ అజితా బేగం ఆమెను విచారణ చేసి స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు. బాధిత మహిళకు వైద్య పరీక్షలు చేయించామని నివేదిక వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ ను విచారణ చేస్తామని పోలీసులు అంటున్నారు.

ఆమె సీపీఎం లీడర్
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ మీద రేప్ చేశాడని, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరిపించారని కేసు నమోదు చేశామని కేరళ పోలీసులు స్పష్టం చేశారు. ఓ ఎమ్మెల్యే కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీ నాయకురాలి మీద అత్యాచారం చెయ్యడంతో కేరళలో కలకలం రేపింది.

రాజకీయ కక్ష, ఎమ్మెల్యే
తనకు ఏపాపం తెలీదని, రాజకీయ కక్షలకారణంగా తన మీద కేసు నమోదు చేశారని కేరళ ఎమ్మెల్యే ఎం. విన్మెంట్ అంటున్నారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలితో రాజీ చేసుకోవాలని ఎమ్మెల్యే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని శుక్రవారం కేరళ మీడియా వార్తలు ప్రసారం చేస్తున్నది.

నో కామెంట్ అంటున్న కాంగ్రెస్
కేరళలో తమ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మహిళ మీద అత్యాచారం చేశాడని కేసు నమోదు అయినా ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నోరు విప్పడం లేదు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నో కామెంట్ అంటున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications