Viral video: రేప్, అమ్మాయిని, అబ్బాయిని కట్టేసి దాడి, భారత్ మాతాకి జై, వీడియో తీసి, ఛీ !

భోపాల్/ బెంగళూరు: ఒంటరిగా కనిపించిన 16 ఏళ్ల అమ్మాయి మీద ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. అత్యాచారం జరిగిన విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అత్యాచారం చేసిన నిందితుడినితో పాటు అమ్మాయిని గ్రామంలో చెట్టుకు కట్టేసి చితకబాదేశారు. అత్యాచారిని గురైన అమ్మాయిని, నిందితుడిని తాళ్లతో కట్టేసి గ్రామం మొత్తం ఊరేగించి చితకబాదేశారు. ఇదే సమయంలో కామాంధుడిని, బాలికను ఊరేగిస్తున్న సమయంలో బాధితురాలి బంధువులు 'భారత్ మాతాకి జై ' అంటూ నినాదులు చేస్తున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రేప్ కేసుకు, భారత్ మాతాకి జైకి ఏమిటి సంబంధం ? అంటూ సామాన్యప్రజలు మండిపడుతున్నారు.

 ఆలీరాజ్ పూర్ లో !

ఆలీరాజ్ పూర్ లో !

మధ్యప్రదేశ్ లోని ఆలీరాజ్ పూర్ జిల్లాలో గిరిజనుల ప్రాభల్యం ఎక్కువగా ఉంది. ఆలీరాజ్ పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలిక మీద అదే గ్రామంలో నివాసం ఉంటున్న 21 ఏళ్ల యువకుడు కన్నువేశాడు. చాలా రోజుల నుంచి అమ్మాయి మీద కన్ను వేసిన కామాంధుడు ఆదివారం (నిన్న) ఆమెపై అత్యాచారం చేశాడు.

కామాంధుడిని తాళ్లతో కట్టేసి చితకబాదేశారు

కామాంధుడిని తాళ్లతో కట్టేసి చితకబాదేశారు

అత్యాచారం జరిగిన విషయం అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. అంతే అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి కామాంధుడిని పట్టుకుని గ్రామం మధ్యలోని ఓ చెట్టుకు కట్టేసి అతన్ని చితబాదేశారు. ధరిద్రం ఏమిటంటే కామాంధుడిని చితకబాదే సమయంలో అత్యాచారినికి గురైనా బాధితురాలిని అక్కడే కట్టేసి ఆమె మీద దాడి చేశారు. అదే సమయంలో ఓ వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసి ఆ విషయం బహిరంగంగా అందరికి తెలిసేలా చేశారు.

ఊరేగింపు.... భారత్ మాతాకి జై

ఊరేగింపు.... భారత్ మాతాకి జై

కామాంధుడిని చెట్టుకు కట్టేసి చితకబాదిన బాధితురాలి బంధువులు తరువాత అతన్ని, బాధితురాలిని తాళ్లతో కట్టేసి గ్రామంలో ఊరిగించారు. అమ్మాయిని, ఆమె మీద రేప్ చేసిన కామాంధుడిని గ్రామంలో ఊరేగిస్తున్న సమయంలో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు.

 వీడియో వైరల్... రచ్చరచ్చ

వీడియో వైరల్... రచ్చరచ్చ

కామాంధుడిని ఊరేగిస్తున్న సమయంలో వీడియో తియ్యడం, ఆ వీడియోలో భారత్ మాతాకి జై అనే నినాదాలు వినపడుతున్న వీడియోను సొషల్ మీడియాలో విడుదల చెయ్యడంతో అది వైరల్ అయ్యింది. రేప్ చేసిన కామాంధుడికి దేహశుద్ది చేస్తున్న సమయంలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చెయ్యడం అవసరమా ?, దానికి దీనికి ఏమిటి సంబంధం అంటూ నెటిజన్లు మండిపడటంతో ఆ టాపిక్ వైరల్ అయ్యి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.

 అందరి మీద కేసులు

అందరి మీద కేసులు

కామాంధుడితో పాటు మొత్తం ఆరు మందిని అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ మీడియాకు చెప్పారు. జబాట్ పోలీస్ స్టేషన్ లో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి. అమ్మాయి మీద అత్యాచారం చేశాడని 21 ఏళ్ల కామాంధుడి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రేప్ చేసిన నిందితుడిని, అత్యాచారానికి గురైన అమ్మాయిని బహిరంగ ప్రదేశంలో కట్టేసి దాడి చేసి ఇద్దరిని ఊరేగించారని, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారని అమ్మాయి కుటుంబ సభ్యుల మీద మరో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. 16 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిన కామాంధుడికి ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి దిలీప్ సింగ్ బిల్వాల్ స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+