రేప్ బాధితురాలు నగ్నంగా మూడు గంటలు మంచంపై

ఈ సంఘటనపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మంజుల మానస సోమవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 23 ఏళ్ల మహిళను, ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర అవమానానికి గురి చేశారని ఆమె లైంగిక దాడుల కేసుల నిరోధంపై జరిగిన సమావేశంలో చెప్పారు.
మహిళను మూడు గంటల పాటు మంచంపై పడుకోబెట్టి పట్టించుకోకపోవడంపై మానస వైద్యుల నుంచి వివరణను డిమాండ్ చేశారు. డ్యూటీ డాక్టర్‌ను డిప్యూటీ కమిషనర్ ఛేంబర్‌కు పిలిపించి వివరణ అడిగారు. అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.
సమావేశం వివరాలను ఆమె వెల్లడించలేదు. మహిళకు పరీక్షలు నిర్వహించడంలో జాప్యం చేశారని మాత్రమే ఆమె అన్నారు. వైద్య పరీక్షలు నిర్వహించడంలో జాప్యం జరిగిందని, అయితే బాధితురాలి తల్లి అభ్యంతంర చెప్పడంతో ఆ జాప్యం జరిగిందని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications