రేప్ వీడియోలు: రూ 50 నుంచి రూ 150కి సేల్ !

ఆగ్రా: మహిళలు, యువతులపై అత్యాచారాలు చేస్తూ వీడియోలు తీసి వారిని బెదిరించడమే కాకుండా వాటిని సీడీలుగా తయారు చేసి విక్రయిస్తున్నారని వెలుగు చూసింది. ఉత్తర్ ప్రదేశ్ లో రేప్ వీడియోలను అంగడి సరుకులా మార్చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

అత్యాచారానికి గురైన వారిని బెదిరించడానికి ఉపయోగిస్తున్న రేప్ వీడియోలను ఉత్తర్ ప్రదేశ్ లో పలు ప్రాంతాల్లోని వ్యాపారులు, మొబైల్ కరెన్సీ రీచార్జ్ షాప్ లు, సీడీ సెంటర్స్ లో విక్రయిస్తున్నారని వెలుగు చూసింది. పోలీసులు సొదాలు చేసినా వ్యాపారులు చాకచక్యంగా తప్పించుకుంటున్నారు.

Rape videos on sale at Rs 50 to Rs 150 in Uttar Pradesh

పోలీసు అధికారుల కళ్లుగప్పి రోజుకు వందల సంఖ్యలో రేప్ వీడియోలను రూ. 50 నుంచి రూ. 150 వరకు విక్రయిస్తున్నారు. వీడియో క్లిప్ నిడివిని బట్టి వాటిని విక్రయిస్తున్నారు. 30 సెకండ్ల నుంచి ఐదు నిమిషాల నిడివివున్న వీడియోలు విక్రయిస్తున్నారు.

పోలీసులకు చిక్కకుండా ఉండటానికి సీడీ సెంటర్, మొబైల్ కరెన్సీ రీచార్జ్ చేసే వ్యాపారులు నమ్మకమైన కస్టమర్లకు మాత్రమే రేప్ వీడియోలను విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని ఓ జాతీయ మీడియా సంస్థ కథనం ప్రచురించింది.

ఆగ్రాలోని బెలాన్ గంజ్, కమలానగర్, బాల్కెశ్వర్ తదితర ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లలో డౌన్ లోడ్ చేయిస్తున్నారు. కొంత మంది ఇలాంటి రేప్ వీడియోలను డౌన్ లోడ్ చేసి విక్రయిస్తుంటారని, కొందరు రేపిస్టులు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాటిని వ్యాపారులు డౌన్ లోడ్ చేసుకుంటున్నారని వెలుగు చూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+