బెంగళూరులో సైకో కిల్లర్ దొరె అరెస్టు, 8 రేప్ లు, హత్యలు: పోలీసులకు సినిమా చూపించాడు !

బెంగళూరు: ఒంటరి మహిళలపై అత్యాచారం చేసి తరువాత దారుణంగా హత్యలు చేస్తున్న సైకో కిల్లర్ ను బెంగళూరు నగరంలోని బ్యాడరహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. ఇంతకాలం తప్పించుకుని తిరుగుతున్న సైకో కిల్లర్ దొరె (50)ని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

8 రేప్ లు, హత్యలు

8 రేప్ లు, హత్యలు

బెంగళూరు నగరంలోని యశవంతపుర, పీణ్య, బ్యాడరహళ్ళి ప్రాంతాల్లో 8 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యలు చేశారు. పోలీసులు కేసులు పరిశీలించగా అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా అత్యాచారం చేసి హత్యలు చేశారని వెలుగు చూసింది.

పోలీసులకు సినిమా

పోలీసులకు సినిమా

ఒంటరిగా ఉన్న 8 మందికి పైగా మహిళల మీద అత్యాచారం చేసి హత్య చేసింది సైకో కిల్లర్ దొరె అని పోలీసులు గుర్తించారు. అయితే దొరె మాత్రం పోలీసుల చేతికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతూ సినిమా చూపించాడు. మంగళవారం బ్యాడరహళ్ళిలో సైకో కిల్లర్ దొరె ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది.

సైకో కిల్లర్

సైకో కిల్లర్

బ్యాడరహళ్ళి పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి దొరె ఉన్న ప్రాంతానికి చేరుకుని అతన్ని చాకచక్యంగా అరెస్టు చేశారు. దొరె అరెస్టుతో యశవంతపుర, పిణ్యా, బ్యాడరహళ్లి ప్రాంతాల ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

బంగారు నగలు

బంగారు నగలు

సైకో కిల్లర్ దొరె ఇంకా ఎంత మంది మీద అత్యాచారం చేసి హత్య చేశాడు అని విచారణలో వెలుగు చూస్తుందని పోలీసులు అంటున్నారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటున్న దొరె మొదట వారి మీద అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి వారి దగ్గర ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేసి పారిపోతున్నాడని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+