ఫేస్ బుక్ ప్రేమ, అత్యాచారం, ఆత్మహత్య, బెంగళూరు యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష !
బెంగళూరు: మైనర్ మీద అత్యాచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణం అయిన కామాంధుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు చెప్పింది. 14 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసిన మనోజ్ (26) అనే యువకుడు జైలు శిక్షకు గురైనాడు.
బెంగళూరు నగరంలోని నందిని లేఔట్ లో మనోజ్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి షేస్ బుక్ లో బాలిక (14) పరిచయం అయ్యింది. బాలికను ప్రేమిస్తున్నానని మనోజ్ నమ్మించాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానని, తనతో కలిసి ఉండాలని మనోజ్ బాలికకు మాయమాటలు చెప్పాడు.
Recommended Video


తరువాత బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను నమ్మించిన మనోజ్ అత్యారం చేశాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక మనోజ్ మీద ఒత్తిడి చేసింది. నిన్ను పెళ్లి చేసుకోనని, నీకు దిక్కున్న చోట చెప్పుకోవాలని మనోజ్ ఎదురుతిరిగాడు. మనోజ్ మోసం చేశాడని బాలిక జీవితంపై విరక్తి పెంచుకుంది.
ప్రియుడి చేతిలో మోసపోయానని ఆవేదనతో 2013 నవంబర్ 5వ తేదీన బాలిక ఆత్మహత్య చేసుకుంది. బాలిక తండ్రి ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మనోజ్, బాలిక మొబైల్ ఫోన్లు, ఫేస్ బుక్ అకౌంట్ లు పరిశీలించిన పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.
బాలికను నమ్మించిన మనోజ్ అత్యాచారం చెయ్యడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ఆధారాలు సేకరించిన పోలీసులు న్యాయస్థానంలో ఎఫ్ఐఆర్ సమర్పించారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ఆర్. శారదా నిందితుడు మనోజ్ నేరం చేశాడని రుజువు కావడంతో 20 ఏళ్లు జైలు శిక్ష విదిస్తూ సంచలన తీర్పు చెప్పారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications