బీ అలర్ట్.. ఈ జిల్లాలో వింత వ్యాధి.. జనాల జుట్టు, గోళ్లు ఊడిపోతున్నాయి..?

మానవాళిని వింత వింత వ్యాధులు చుట్టుముట్టడం సాధారణంగా మారిపోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఇతర అనేక కారణాల వల్ల మనుషులు వింత, అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. అటు జంతువులు, పక్షులు, ఇతర కీటకాల నుంచి కూడా మానవులు ఈ వ్యాధుల బారిన పడుతున్నారు. తాజాగా ఈ జిల్లాలో ప్రజలు వింత వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి సోకిన వాళ్లకు మొదట జుట్టు, ఆ తర్వాత గోళ్లు ఊడిపోతున్నాయంటూ భయబ్రాంతులకు గురవుతున్నారు. మరి ఈ గ్రామస్థులకు సోకిన వ్యాధి ఏంటి ?

మహారాష్ట్ర బుల్ధానా జిల్లాలోని షేగావ్ తహసీల్ లో ఒక వింత వ్యాధితో ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామాల్లోని జనాలకు జుట్టు, గోళ్లు ఊడిపోతున్నాయని భయబ్రాంతులకు లోనవుతున్నారు. స్థానికంగా బట్టతల వైరస్ అని పిలుస్తున్నారు. ఈ వైరస్ కారణంగా తీవ్రమైన జుట్టు రాలడంతో బాధపడుతున్నారు. ఆ తర్వాత గోళ్లు కూడా ఊడిపోతున్నాయని అన్నారు.

Rare Disease Causes Hair and Nail Loss in Buldhana Villages

స్థానికుల సమాచారం ప్రకారం ఈ ఆందోళనకరమైన పరిస్థితి మొదటిసారిగా డిసెంబర్ 2024లో వెలుగులోకి వచ్చిందట. బొండ్‌గావ్, దాని చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది గ్రామస్థులు వేగంగా జుట్టు రాలుతుందని ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏకంగా చాలా మంది గోళ్లు కూడా ఊడిపోతున్నాయని ఫిర్యాదు చేశారు.

Rare Disease Causes Hair and Nail Loss in Buldhana Villages

ఇదే విషయంపై బొండ్‌గావ్‌ గ్రామ సర్పంచ్ స్పందించారు. ఈ సమస్య డిసెంబర్ చివర్లో అకస్మాత్తుగా జుట్టు రాలడంతో మొదలైంది. ఇప్పుడు గత నాలుగు ఐదు రోజులుగా ప్రజల గోళ్లు కూడా ఊడిపోతున్నాయి అని తెలిపారు. ఇక తాజాగా జిల్లా ఆరోగ్య శాఖకు చెందిన బృందం ప్రభావిత ప్రాంతాలను సందర్శించి విశ్లేషణ కోసం రోగుల రక్త నమూనాలను సేకరించింది. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+